Naga Chaitanya Thandel: నాగ చైనత్య, చందూ మొండేటి సినిమాకు డిఫరెంట్ టైటిల్.. పోస్టర్ రిలీజ్
Naga Chaitanya Thandel: నాగ చైనత్య, కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా టైటిల్ బుధవారం (నవంబర్ 22) రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
Naga Chaitanya Thandel: నాగ చైతన్య తన 23వ సినిమాను కార్తికేయ ఫేమ్ చందూ మొండేటితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఎన్సీ23గా పిలిచిన ఈ సినిమాకు బుధవారం (నవంబర్ 22) తండేల్ అనే టైటిల్ పెట్టారు. లవ్ స్టోరీ మూవీ తర్వాత మరోసారి చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఇది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
తన నెక్ట్స్ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ నాగ చైతన్య చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. "ఎన్సీ23 ఇక తండేల్. ఈ క్యారెక్టర్ పోషించడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ టీమ్ అంటే కూడా నాకు అభిమానం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. దుల్ల కొట్టేద్దాం.. జై దుర్గా భవానీ" అనే క్యాప్షన్ తో చైతన్య ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేశాడు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పేరులాగే చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ బోటులో చాలా సీరియస్ లుక్ లో నాగ చైతన్య కనిపించాడు. "తన ప్రజల కోసం అన్ని అడ్డంకులతో పోరాడే ఓ నాయకుడు జన్మించాడు" అంటూ ఈ తండేల్ సినిమాలో చైతన్య క్యారెక్టర్ ను మేకర్స్ వివరించారు. రగ్గ్‌డ్ లుక్ లో చై తన లవర్ బాయ్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్నాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్కౌట్లు చేసి కండలు పెంచిన చైతన్య.. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే తన మేకోవర్ ఎలా ఉందో చూపించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాస్ తన జీఏ2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తండేల్ అంటే ఏంటి?
నాగ చైతన్య సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టగానే అసలు దీనికి అర్థమేంటని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి మరికొందరు సమాధానమిస్తూ.. తండేల్ అంటే ఓ పడవకు నాయకుడు అని చెప్పడం విశేషం. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఓ లీడర్ ఉంటాడని, అతన్నే స్థానికంగా తండేల్ అని పిలుచుకుంటారని చెబుతున్నారు. ఆ లెక్కన ఈ సినిమాలో చైతన్య పాత్రపై ఓ స్పష్టత వచ్చినట్లే.