Thalapathy Vijay 69 Movie: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీ - డైరెక్ట‌ర్ ఇత‌డే - బ‌డ్జెట్ ఎంతంటే!-thalapathy vijay 69 movie director and release date officially locked kollywood tamil cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay 69 Movie: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీ - డైరెక్ట‌ర్ ఇత‌డే - బ‌డ్జెట్ ఎంతంటే!

Thalapathy Vijay 69 Movie: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీ - డైరెక్ట‌ర్ ఇత‌డే - బ‌డ్జెట్ ఎంతంటే!

Nelki Naresh Kumar HT Telugu
Sep 14, 2024 05:53 PM IST

Thalapathy Vijay 69 Movie: ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీకి సంబంధించిన అపీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స‌య్యాడు. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ మూవీని రిలీజ్ కానుంది.

 ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ మూవీ
ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ మూవీ

Thalapathy Vijay 69 Movie: ద‌ళ‌ప‌తి విజ‌య్ కెరీర్‌లో లాస్ట్ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడితో రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

భారీ హైప్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. 69వ మూవీనే త‌న చివ‌రి సినిమా అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్ర‌క‌టించాడు. దాంతో అనౌన్స్‌మెంట్‌కు ముందే ఈ సినిమాపై భారీగా బ‌జ్ ఏర్ప‌డింది. విజ‌య్ లాస్ట్ మూవీకి ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల పేరు వినిపించాయి.

హెచ్ వినోథ్‌...

కానీ ఊహించిన విధంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం హెచ్ వినోథ్‌కు ద‌క్కింది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డైరెక్ట‌ర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ శ‌నివారం వెల్ల‌డించింది.

అనిరుధ్ మ్యూజిక్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో టార్చ్ బేర‌ర్ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి చేయి క‌నిపిస్తోంది. ప్ర‌జాస్వామ్యానికి అత‌డో టార్చ్ బేర‌ర్ అంటూ ప్రీ లుక్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌...

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హెచ్ వినోద్ ద‌ళ‌ప‌తి 69 మూవీని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో యంగ్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఈ మూవీ ఒక వేదిక‌గా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

700 కోట్ల బ‌డ్జెట్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ మూవీకి సంబంధించిన బ‌డ్జెట్, రెమ్యున‌రేష‌న్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు 700 కోట్ల బ‌డ్జెట్‌తో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం విజ‌య్ 275 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీతో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకున్న హీరోగా విజ‌య్ రికార్డ్‌ను సృష్టించిన‌ట్లు చెబుతోన్నారు.

355 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఇటీవ‌లే ది గోట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తొమ్మిదో రోజుల్లో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 355 కోట్ల గ్రాస్‌ను, 173 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 12 కోట్ల గ్రాస్‌ను ఏడు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ది గోట్ మూవీలో స్నేహా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, జ‌య‌రామ్‌, మోహ‌న్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ హీరోలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో...

ఇటీవ‌లే త‌మిళ‌గ వెట్రిక‌ళ‌గం పేరుతో పొలిటిక‌ల్ పార్టీని ప్ర‌క‌టించాడు విజ‌య్‌. 2026 త‌మిళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పోటీచేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.