Balakrishna: బాలకష్ణపై నోరు పారేసుకున్న తమిళ డైరెక్టర్.. హీరోయిన్ హన్సిక ముందు పరువు తీశాడు
Balakrishna: టాలీవుడ్ హీరో బాలకృష్ణపై తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ నోరు పారేసుకున్నాడు. ఓ పబ్లిక్ ఈవెంట్లో బాలయ్య బాబు పరువు తీసేలా అతడు మాట్లాడిన తీరు చూసి అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి వ్యక్తో అతని అభిమానులకు తెలుసు. అయితే అంతటి హీరో గురించి ఓ ప్రముఖ డైరెక్టర్ పబ్లిగ్గా నోరు పారేసుకోవడం, హేళన చేయడం షాక్ కు గురి చేస్తోంది. తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఈ మధ్య గార్డియన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా బాలయ్య బాబుపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరోయిన్ హన్సిక ముందే బాలకృష్ణ పరువు తీసేలా మాట్లాడాడు.
ఎవరైనా నవ్వితే బాలకృష్ణకు కోపం
హన్సిక నటించిన గార్డియన్ అనే తమిళ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు తమిళ ఫిల్మ్ మేకర్ కేఎస్ రవికుమార్ వచ్చాడు. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణపై అతడు చేసిన కామెంట్స్ చూసి ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. రూలర్ మూవీ చేస్తున్న సమయంలో బాలయ్య బాబు సెట్స్ లో తన అసిస్టెంట్ ను కొట్టడానికి వచ్చాడంటూ రవికుమార్ చెప్పాడు.
సెట్స్ లో ఎవరైనా నవ్వితే బాలకృష్ణకు తెగ కోపం వచ్చేదని కేఎస్ రవికుమార్ వెల్లడించాడు. "సెట్ లో ఎవరైనా నవ్వితే చాలు.. అతనికి బాగా కోపం వచ్చేది. అతడు ఎందుకు నవ్వుతున్నాడు అని అడిగేవాడు. శరవణన్ అని నా అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరు ఓసారి సెట్స్ లో ఫ్యాన్ ను కాస్త బాలకృష్ణ వైపు తిప్పాడు.
దీంతో అతని విగ్ కాస్త అటూ ఇటూ జరిగింది. దీంతో అతనికి బాగా కోపం వచ్చింది. అతడు ఎందుకు నవ్వుతున్నాడు అని అడిగాడు. మావాడే అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాను. కాదు అతడు ఆపోజిట్ గ్యాంగ్ అని అతడు అన్నాడు" అంటూ బాలయ్య బాబును హేళన చేసినట్లుగా నవ్వుతూ రవికుమార్ చెప్పాడు.
అతని కామెంట్స్ చూసి అక్కడున్న వాళ్లంతా పడీపడీ నవ్వారు. ఆ సమయంలో స్టేజ్ పై హన్సిక మోత్వానీ కూడా ఉంది. ఆమె కూడా రవికుమార్ కామెంట్స్ చూసి తెగ నవ్వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు.
నువ్వు ఇలాంటివాడివి అనుకోలేదు
బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ వీడియోపై ఘాటుగా స్పందించారు. ఇన్నాళ్లూ నీపై గౌరవం ఉండేది కానీ ఇక నుంచి ఉండదు అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. మీ నుంచి ఇలాంటి కామెంట్స్ అసలు ఊహించలేదు అంటూ మరో అభిమాని రవికుమార్ మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు. బాలయ్యతో 2018లో జైసింహ, 2019లో రూలర్ సినిమాలు చేశాడు కేఎస్ రవికుమార్.
అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇదే విషయాన్ని ఓ అభిమాని చెబుతూ రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జైసింహ యావరేజ్ కాగా.. రూలర్ డిజాస్టర్ అయింది.. రూలర్ లో బాలకృష్ణ హెయిర్ స్టైల్ ను ట్రోల్ చేశారు.. నువ్వా మాట్లాడేది అంటూ సదరు అభిమాని అన్నాడు.
ఇక మరికొందరు మాత్రం రవికుమార్ ను వెనకేసుకొచ్చారు. బాలకృష్ణ ఇలా అందరినీ అనుమానిస్తుంటే.. ప్రశాంతంగా బతకలేడు.. రవికుమార్ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు అని కొందరు అతనికి మద్దతుగా నిలిచారు. 2017లో మూవీ సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పై బాలకృష్ణ చేయి చేసుకోవడం, తన షోలేసులు కట్టించుకోవడం వైరల్ అయింది.
టాపిక్