Hansika 105 Minutes: ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండానే థియేట‌ర్ల‌లో హ‌న్సిక 105 మినిట్స్ రిలీజ్ - సింగిల్ క్యారెక్ట‌ర్‌తో మూవీ-hansika 105 minutes movie releasing in theatres without interval break ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika 105 Minutes: ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండానే థియేట‌ర్ల‌లో హ‌న్సిక 105 మినిట్స్ రిలీజ్ - సింగిల్ క్యారెక్ట‌ర్‌తో మూవీ

Hansika 105 Minutes: ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండానే థియేట‌ర్ల‌లో హ‌న్సిక 105 మినిట్స్ రిలీజ్ - సింగిల్ క్యారెక్ట‌ర్‌తో మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 25, 2024 08:34 AM IST

Hansika 105 Minutes: హ‌న్సిక 105 మినిట్స్ మూవీ ఈ శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 26న‌) థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండా రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత తెలిపాడు.

హ‌న్సిక 105 మినిట్స్ మూవీ
హ‌న్సిక 105 మినిట్స్ మూవీ

Hansika 105 Minutes: సినిమాకు ఇంట‌ర్వెల్ బ్రేక్ అన్న‌ది త‌ప్ప‌నిస‌రి. ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండా సినిమాలు రిలీజ్‌ చాలా అరుదు. హ‌న్సిక్ లేటెస్ట్ మూవీ 105ని ఇంట‌ర్వెల్ లేకుండా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్రొడ్యూస‌ర్ తెలిపాడు. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో సింగిల్ షాట్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాకు రాజు దుస్సా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట న‌ల‌భై ఐదు నిమిషాలు మాత్ర‌మే ఉండ‌నుంద‌ట‌. అందుకే ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండా సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తోన్న‌ట్లు నిర్మాత బొమ్మ‌క్ శివ తెలిపాడు. 105 మినిట్స్ మూవీని ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండానే షూట్ చేశామ‌ని అన్నాడు. కానీ థియేటర్ వాళ్ళు వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చుఅని ప్రొడ్య‌స‌ర్ తెలిపాడు.

హ‌న్సిక మాత్ర‌మే...

సినిమా మొత్తం ఒక‌టే క్యారెక్ట‌ర్‌ ఉంటుంది. హ‌న్సిక త‌ప్ప మ‌రో పాత్ర స్క్రీన్‌పై క‌నిపించ‌ద‌ని నిర్మాత అన్నాడు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మ‌రొకొరి వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ కోసం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గుర్తింపును తెచ్చుకున్న హిందీ న‌టుడిని అప్రోచ్ అయ్యాం. అత‌డి వాయిస్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ఉంటుంద‌ని నిర్మాత అన్నాడు. గ్లామ‌ర్ డాల్‌ పాత్ర‌ల‌కు భిన్నంగా హ‌న్సిక లోని యాక్టింగ్ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో బ‌య‌ట‌పెట్టే మూవీ ఇద‌ని బొమ్మ‌క్ శివ చెప్పాడు.

హ‌న్సిక కాకుండా మొద‌ట వేరే హీరోయిన్‌తో సినిమా చేయాల‌ని అనుకున్నామ‌ని తెలిపాడు. కానీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో హ‌న్సిక‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని క‌థ చెప్ప‌గానే ఆమె ఈ సినిమాను అంగీక‌రించింద‌ని అన్నాడు. జ‌న‌వ‌రి 26న తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మిగిలిన భాష‌ల్లో రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని అన్నాడు. సింగిల్ క్యారెక్ట‌ర్ అయినా సినిమా బ‌డ్జెట్ మాత్రం మూడున్న‌ర కోట్లు దాటిన‌ట్లు నిర్మాత చెప్పాడు.

దేశ‌ముదురుతో ఎంట్రీ...

మై నేమ్ ఈజ్ శృతితో గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో చివ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది హ‌న్సిక‌. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కిన మై నేమ్ ఈజ్ శృతి తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. మ‌రోసారి ఎక్స్‌పీరిమెంట్ మూవీలో 105 మినిట్స్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతున్న‌ది. అల్లు అర్జున్ దేశ‌ముదురుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక ఒప్పుడు అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న‌ది.

కందిరీగ‌, దేనికైనా రెడీతో పాటు ప‌లు సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న‌ది. త‌మిళంలో విజ‌య్‌, సూర్య వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. న‌వ‌త‌రం హీరోయిన్ల పోటీ, ప‌రాజ‌యాల కార‌ణంగా కొంత‌కాలంగా అవ‌కాశాల రేసులో వెనుక‌బ‌డిన హ‌న్సిక స‌క్సెస్ కోసం ఎదురుచూస్తోంది. త‌మిళంలో రౌడీ బేబీ, గార్డియ‌న్‌తో పాటు మ‌రె రెండు సినిమాలు చేస్తోంది హ‌న్సిక‌. 2022లో ప్రియుడు సోహైల్ క‌థురియాను పెళ్లాడింది హ‌న్సిక‌. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే సినిమాలు చేస్తోంది.

IPL_Entry_Point

టాపిక్