Bheema vs Gaami: గోపీచంద్ వర్సెస్ విశ్వక్‌సేన్ బాక్సాఫీస్ ఫైట్ - భీమాకు గట్టి పోటీ ఇస్తోన్న గామి
Bheema vs Gaami: ఈ రెండు సినిమాలతో పాటు మార్చి 8న ప్రేమలు మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమాతో పాటు విశ్వక్‌సేన్ గామి పోటీపడబోతున్నాయి. ఈ ఇద్దరిలో బాక్సాఫీస్ విన్నర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చే హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
Bheema vs Gaami: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమాతో పాటు విశ్వక్‌సేన్ గామి పోటీపడబోతున్నాయి. ఈ రెండు సినిమాల టీజర్స్, ట్రైలర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఆడియెన్స్‌లో భీమా, గామి క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
హిట్టు మాట విని చాలా కాలం అయ్యింది...
ప్రస్తుతం గోపీచంద్, విశ్వక్‌సేన్ ఇద్దరికి హిట్టు అవసరంగా మారింది. గోపీచంద్ హిట్ లేక చాలా కాలమే అయ్యింది. 2021లో రిలీజైన సీటీమార్ తర్వాత గోపీచంద్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలుస్తూ వచ్చాయి. మారుతి పక్కా కమర్షియల్, శ్రీవాస్ రామబాణం సినిమాలపై రిలీజ్‌కు ముందు హైప్ ఉన్నా కంటెంట్ వీక్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఓ సక్సెస్‌తో ఈ డిజాస్టర్స్ ప్రభావం నుంచి బయటపడాలని గోపీచంద్ భావిస్తున్నాడు.
డ్యూయల్‌షేడ్ క్యారెక్టర్...
భీమాతో గోపీచంద్ బ్లాక్‌బస్టర్ కోరిక తీరాలనే కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఏ. హర్ష ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో ఓ టెంపుల్‌ను కాపాడే వ్యక్తిగా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తోన్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌లో గోపీచంద్‌పై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్, హీరోయిజం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుంటున్నాయి. ఈ ట్రైలర్ కారణంగా సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు హీరోయిన్లు...
భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సోమవారం నుంచి భీమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో భీమాకే ఎక్కువ థియేటర్లు దొక్కబోతున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు యాభై లక్షల వరకు జరిగినట్లు సమాచారం. శుక్రవారం వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కోటి వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
గామి....ఐదేళ్లు షూటింగ్...
విశ్వక్ సేన్ కెరీర్‌లో ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ను జరుపుకున్న మూవీగా గామి నిలిచింది. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ఐదేళ్ల పాటు జరిగింది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. ట్రైలర్‌తో గామి సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ప్రమోషన్స్‌లో సందీప్ వంగా పాల్గొనడం, ప్రభాస్ వీడియో బైట్స్ ద్వారా గామిని ప్రమోట్ చేయడం బిజినెస్‌కు హెల్పయింది.
హిట్ తర్వాత హిట్టు లేదు...
హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత విశ్వక్‌సేన్ సరైన సక్సెస్ లేదు. అశోకవనంలో అర్జున కళ్యాణం, దాస్ దా ధమ్కీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. దాంతో గామి సక్సెస్ అతడికి ఇంపార్టెంట్‌గా మారింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వాలని విశ్వక్‌సేన్ భావిస్తోన్నాడు. గామి సినిమాలో చాందిని చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించాడు. ఈ సినిమాకు విధ్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెరకెక్కిన ఈ మూవీని రెమ్యునరేషన్ లేకుండా విశ్వక్‌సేన్ ఫ్రీగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.