Taapsee Pannu Marriage: త్వరలో హీరోయిన్ తాప్సీ వివాహం? వరుడు ఎవరంటే..-taapsee pannu to marry her boyfriend mathias boe report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taapsee Pannu Marriage: త్వరలో హీరోయిన్ తాప్సీ వివాహం? వరుడు ఎవరంటే..

Taapsee Pannu Marriage: త్వరలో హీరోయిన్ తాప్సీ వివాహం? వరుడు ఎవరంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 11:09 PM IST

Taapsee Pannu Marriage: హీరోయిన్ తాప్సీ పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆమె వివాహం ఎప్పుడు జరగనుందో కూడా సమాచారం వెల్లడైంది. ఆ వివరాలు ఇవే..

Taapsee Pannu Marriage: త్వరలో హీరోయిన్ తాప్సీ వివాహం? వరుడు ఎవరంటే..
Taapsee Pannu Marriage: త్వరలో హీరోయిన్ తాప్సీ వివాహం? వరుడు ఎవరంటే.. (Instagram)

Taapsee Pannu Wedding: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈనెలలోనే పెళ్లి చేసుకున్నారు. తన బాయ్‍ఫ్రెండ్, నటుడు జాకీ భగ్నానీని రకుల్ మనువాడారు. గోవాలో వీరి పెళ్లి ఫిబ్రవరి 21న జరిగింది. కాగా, హీరోయిన్ తాప్సీ పన్ను కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం బయటికి వచ్చింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న తన బాయ్‍ఫ్రెండ్‍ను తాప్సీ వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఆ వివరాలివే..

తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్‍ని తాప్సీ వివాహం చేసుకోనున్నారని ఎన్‍డీటీవీ రిపోర్ట్ వెల్లడించింది. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని ఆ రిపోర్ట్ పేర్కొంది.

పెళ్లి ఎప్పుడు?

తాప్సీ - మాథియాస్ వివాహం మార్చి నెలాఖరులో జరుగుతుందని తెలుస్తోంది. రాజస్థాన్‍లో ఉదయ్‍పూర్ వేదికగా వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. బాలీవుడ్ సెలెబ్రిటీలను చాలా తక్కువ మందినే ఆహ్వానించాలని అనుకుంటున్నారని టాక్. సిఖ్, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

తాప్సీ లవ్ స్టోరీ

సుమారు పదేళ్లుగా తాప్సీ - మాథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఎక్కువగా ఈ విషయాన్ని వారు చెప్పలేదు. ఇటీవల తాప్సీ తమ ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్‍లో తన తొలి సినిమా ఛష్మీ బద్దూర్ (2013) షూటింగ్ సమయంలో మాథియస్‍ను తాను కలిశానని తాప్సీ చెప్పారు. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మాథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది.

తాప్సీ 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదంతోనే తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్‍కు వెళ్లారు. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. 2013లో బాలీవుడ్‍లోనూ అడుగుపెట్టారు. పింక్ సినిమాతో హిందీలో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె టాలెంట్‍కు అందరూ ఫిదా అయ్యారు. అప్పుడప్పుడు తెలుగు చిత్రాలు కూడా చేశారు. అయితే, మూడేళ్లుగా ఎక్కువగా ఆమె బాలీవుడ్‍పైనే దృష్టి సారించారు.

తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ డంకీ గత డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. వీసాలు లేకుండా బ్రిటన్‍కు వెళ్లాలనుకునే స్నేహితుల కథతో డంకీ వచ్చింది. కామెడీ ఎమోషనల్ మూవీగా డంకీ తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. షారుఖ్, తాప్సీతో పాటు విక్కీ కౌశల్, విక్రమ్ కోచ్చర్, అనిల్ గ్రోవర్, బొమ్మన్ ఇరానీ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. డంకీ సినిమా ఓవరాల్‍గా సుమారు రూ.470 కోట్ల వసూళ్లు రాబట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

తాప్సీ పన్ను తదుపరి ‘వా లడీ హై కహా’ చిత్రంలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తికాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరో రెండు చిత్రాలు కూడా తాప్సీ చేతిలో ఉన్నాయి.

WhatsApp channel