Kanguva Release: సూర్య హైబడ్జెట్ మూవీ ‘కంగువ’ విడుదల తేదీపై వీడనున్న ఉత్కంఠ.. ఎప్పుడంటే!
Kanguva Release date Update: కంగువ సినిమా రిలీజ్ డేట్‍పై క్లారిటీ రానుంది. విడుదల తేదీపై అప్‍డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. కొత్త తేదీని వెల్లడించనుంది. ఈ అప్‍డేట్‍కు టైమ్ ఖరారైంది.
కంగువ చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. సూర్య కెరీర్లో ఇది హైయ్యెస్ట్ మూవీగా ఉంది. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శివ. ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో కంగువపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. అయితే, అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. మళ్లీ రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ ఉంది.
కంగువ చిత్రం విడుదల తేదీపై కోసం చేస్తున్న నిరీక్షణ ముగియనుంది. అధికారిక అప్‍డేట్‍కు డేట్, టైమ్ ఖరారయ్యాయి. కొత్త తేదీని మూవీ టీమ్ ప్రకటించనుంది.
అప్‍డేట్ డేట్, టైమ్ ఇవే
కంగువ చిత్రం నుంచి రేపు (సెప్టెంబర్ 19) ఉదయం 11 గంటలకు అప్‍డేట్ రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 18) అధికారికంగా వెల్లడించింది. “ప్రపంచం ఎదురుచూస్తున్న న్యూస్ వచ్చేస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు రానుంది” అని ఈ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ ట్వీట్ చేసింది. సూర్య తాడును పట్టుకొని ఉన్న బ్యాక్‍సైడ్ షాట్ పోస్టర్ తీసుకొచ్చింది. మొత్తంగా రేపు 11 గంటలకు కంగువ రిలీజ్ డేట్‍పై ఉత్కంఠ వీడనుంది.
వాయిదా ఇందుకే..
దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన కంగువ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ చాలాకాలం కిందటే నిర్ణయించారు. అయితే, తమిళ సూపర్ స్టార్ తలైవా హీరోగా నటించిన వెట్టైయన్ చిత్రం కూడా అక్టోబర్ 10వ తేదీని లాక్ చేసుకుంది. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉంటుందనే టెన్షన్ నెలకొంది. అయితే, ఈ పోటీ నుంచి వెనక్కి తగ్గేందుకే కంగువ టీమ్ నిర్ణయించుకుంది. సినిమాను వాయిదా వేసుకుంది. రజినీకాంత్ చాలా సీనియర్ అని, ఆయన చిత్రమే ముందు రావాలని సూర్య కూడా ఓ ఈవెంట్‍లో అన్నారు. రజినీపై తమకు చాలా గౌరవం ఉందని, కంగువ ఆలస్యమవుతుందని వెల్లడించారు.
రిలీజ్ ఎప్పుడు?
కంగువ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే, నవంబర్ బెస్ట్ అని ఇప్పుడు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్‍పై రేపు (సెప్టెంబర్ 19) ఉదయం 11 గంటలకు అధికారిక ప్రకటన రానుంది.
కంగువ సినిమా సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, కిచ్చా సుదీప్, యోగిబాబు కీరోల్స్ చేశారు. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది. కొన్ని విదేశీ భాషల్లోనూ డబ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.