Sunny Leone on Zee Telugu: తొలిసారి తెలుగు టీవీ ఛానెల్లో సన్నీ లియోనీ.. చీరకట్టుతో, తెలుగు మాట్లాడుతూ..
Sunny Leone on Zee Telugu: తొలిసారి తెలుగు టీవీ ఛానెల్లో సన్నీ లియోనీ కనపడనుంది. చీరకట్టులో, తెలుగు మాట్లాడుతూ అలరించనుంది. జీ తెలుగు ఛానెల్లో రానున్న తెలుగు మీడియం ఇస్కూల్ షోలో సన్నీ హోస్ట్ గా కనిపించింది.
Sunny Leone on Zee Telugu: బాలీవుడ్ నటి సన్నీ లియోనీకి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు కదా. అలాంటి నటి తొలిసారి తెలుగు టీవీ ఛానెల్లో కనిపించబోతోంది. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగులో రానున్న సరికొత్త షోలో సన్నీ మెరవనుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు బుధవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ చేసింది.
జీ తెలుగులో రాబోతున్న ఈ షో పేరు తెలుగు మీడియం ఇస్కూల్. ఈ షో కోసం సన్నీతో చేసిన ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. చీరకట్టులో తెలుగు మాట్లాడుతూ సన్నీ ఈ ప్రోమోలో కనిపించింది. "తెలుగు నాకు జీవితాన్ని ఇచ్చింది. అందరికీ నమస్కారం.. జీ తెలుగుకి స్వాగతం. తెలుగుని ఎంటర్‌టైన్మెంట్ తో సెలబ్రేట్ చేసుకుందాం.. తెలుగు మీడియం ఇస్కూల్. నెవర్ బిఫోర్ రియాల్టీ షో" అని సన్నీ తెలుగులో మాట్లాడటం విశేషం.
గతంలో ఎప్పుడూ చూడని రియాల్టీ షో అంటూ జీ తెలుగు ఛానెల్ ఈ తెలుగు మీడియం ఇస్కూల్ ప్రోగ్రామ్ ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీతోపాటు ప్రముఖ సింగర్ మనో కూడా కనిపించాడు. ఇక పలువురు బుల్లితెర, టాలీవుడ్ కమెడియన్లు సన్నీతో కలిసి సందడి చేశారు. ఈ షో సెట్లోకి సన్నీని బొట్టు పెట్టి, హారతి ఇచ్చి స్వాగతం పలకడం విశేషం.
"ద సూపర్ ఆవ్‌సమ్ సన్నీ లియోనీ తెలుగు టెలివిజన్ లోకి ఎక్స్‌ప్లోజివ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు మీడియం ఇస్కూల్ గ్రాండ్, గ్రాండర్, గ్రాండెస్ట్ లాంచ్ కు వెల్‌కమ్. జీ తెలుగులో అతి త్వరలోనే ఈ తెలుగు మీడియం ఇస్కూల్ రాబోతోంది" అనే క్యాప్షన్ తో జీ తెలుగు ఈ ప్రోమో షేర్ చేసింది. అయితే అసలేంటీ షో, దీని కాన్సెప్ట్ ఏంటన్నది మాత్రం తెలియలేదు.
చివర్లో బోర్డుపై అక్షరమాల కనిపించగా.. దానిపైనే షో టైటిల్ కనిపిస్తుంది. పక్కన సన్నీ లియోనీ శారీలో స్మైల్ ఇస్తుండగా ప్రోమో ముగుస్తుంది. 11 ఏళ్ల కిందట బాలీవుడ్ లో జిస్మ్ 2 మూవీతో అడుగుపెట్టిన సన్నీ లియోనీ.. తర్వాత తెలుగులోనూ కరెంటు తీగ, గరుడ వేగ, జిన్నాలాంటి మూవీస్ లో నటించింది. అయితే తెలుగు బుల్లి తెరపై ఆమె కనిపించనుండటం మాత్రం నిజంగా సర్‌ప్రైజే.