Vibe Movie: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా వైబ్-sundeep kishan swaroop rsj vibe movie first look poster logo released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sundeep Kishan Swaroop Rsj Vibe Movie First Look Poster Logo Released

Vibe Movie: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా వైబ్

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 08:39 AM IST

Sundeep Kishan Swaroop RSJ Vibe Movie: హీరో సందీప్ కిషన్ 31వ సినిమాగా వస్తోంది వైబ్. దీనికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే తెరకెక్కించారు. తాజాగా సందీప్ కిషన్ వైబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా వైబ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా వైబ్

Sundeep Kishan Vibe First Look: తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తమిళంలో కెప్టెన్ మిల్లర్, తెలుగులో ఊరు పేరు భైరవకోన మూవీ విజయాలతో క్లౌడ్ నైన్‌లో ఉన్న హీరో సందీప్ కిషన్ పాత్ బ్రేకింగ్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మేకర్స్‌తో చేతులు కలిపారు. సందీప్ కిషన్ కెరీర్‌లో 31వ సినిమాగా వస్తున్న (#SK31) ఈ సినిమాకు స్వరూప్ ఆర్‌ఎస్‌జే (Swaroop RSJ) దర్శకత్వం వహిస్తున్నారు.

సందీప్ కిషన్-స్వరూప్ ఆర్‌ఎస్‌జే కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రొడక్షన్ నంబర్ 5గా నిర్మిస్తున్నారు. తన మొదటి సినిమాతో ప్రశంసలు అందుకున్న స్వరూప్ ఆర్‌ఎస్‌జే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. కథ ఎంపికలో మంచి అభిరుచితో పాటు మంచి సాంకేతిక, నిర్మాణ విలువలతో కంటెంట్ బేస్డ్ సినిమాలను తీయడంలో పేరుగాంచిన రాహుల్ యాదవ్ నక్కిన ఈ కొత్త చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

దీంతో ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'వైబ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో సినిమా నేచర్‌‌ని సూచిస్తూ హ్యాండ్ పంచ్‌గా డిజైన్ చేయబడింది. "యుద్ధం ఎంత పెద్దదైనా, గెలవడం ఎంత కష్టమైనదైనా, ముఖ్యమైనది ఏమిటంటే, మీ పోరాటంలో మీ కోసం కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఎందుకంటే మీరు వారితో 'వైబ్' ఉంది" అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

చూస్తుంటే వైబ్ సినిమా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగుతుందని పోస్టర్ ద్వారా అర్థం అవుతోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఇక వైబ్ ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ వైల్డ్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. తను సిటీలో అల్లర్లలో పాల్గొన్న అతని స్నేహితుల బృందంతో పాటు కనిపిస్తున్నారు. సందీప్ కిషన్ రక్తపు కత్తి, మోలోటోవ్ కాక్‌టెయిల్‌ని పట్టుకొని ఉన్నారు. అతని స్నేహితులు కూడా గాయాలతో ఆయుధాలు పట్టుకుని కనిపించారు.

ఇలా వైబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది. కాగా వైబ్ కాలేజ్ బేస్డ్ యాక్షన్-లవ్ స్టోరీ. ఇది ఒక స్టూడెంట్, అతని స్నేహితులు సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడం వరకు జరిగిన కథ. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. 2025 వేసవిలోవైబ్ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే, ఇటీవల హీరో సందీప్ కిషన్ నటించిన తెలుగు మూవీ ఊరు పేరు భైరవకోన. హారర్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు.

హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటించారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, హర్ష చెముడు (వైవా హర్ష) కామెడీ పండించగా.. వడివుక్కరసి, పి రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point