Sreeleela Joins Ram Movie: రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో చేరిన శ్రీలీల-sreeleela joins ram boyapati movie shooting in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Joins Ram Movie: రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో చేరిన శ్రీలీల

Sreeleela Joins Ram Movie: రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో చేరిన శ్రీలీల

Hari Prasad S HT Telugu
Jan 06, 2023 08:31 AM IST

Sreeleela Joins Ram Movie: రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో చేరింది బ్యూటీఫుల్‌ అండ్‌ టాలెంటెడ్ నటి శ్రీలీల. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

శ్రీలీల
శ్రీలీల

Sreeleela Joins Ram Movie: టాలీవుడ్‌లో డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లను తనదైన రీతిలో అందించే బోయపాటి సినిమాలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణతో అఖండలాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన తర్వాత ఇప్పుడీ డైరెక్టర్‌.. రామ్‌ పోతినేనితో సినిమా చేస్తున్నాడు.

ది వారియర్‌ మూవీ తర్వాత రామ్‌ చేస్తున్న సినిమా ఇది. ఇందులో బ్యూటీఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ నటి శ్రీలీల ఫిమేల్‌ లీడ్‌గా నటిస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌లో ఎంతో ఆసక్తి రేగింది. తాజాగా శ్రీలీల కూడా ఈ మూవీ షూటింగ్‌లో చేరింది. రామ్, శ్రీలీలపై వచ్చే సీన్లను ప్రస్తుతం బోయపాటి షూట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది.

శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. వారియర్‌ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బోయపాటి సినిమాపై రామ్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అతని పక్కన శ్రీలీల నటిస్తుండటంతో వీళ్ల జోడీ సిల్వర్‌ స్క్రీన్‌పై మెస్మరైజ్‌ చేస్తుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

శ్రీలీల చివరిగా ధమాకా మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. మాస్‌ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో శ్రీలీల తన అందం, నటన, డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం