Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2పై అప్‍డేట్! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Squid Game Season 2 OTT Release: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ గురించి తాజాగా బజ్ నడుస్తోంది. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉందో అంచనాలు బయటికి వచ్చాయి.
Squid Game Season 2 OTT: కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. 2021లో వచ్చిన ఈ డిస్టోపియన్ డ్రామా సూపర్ సక్సెస్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులను బ్రేక్ చేసింది. గ్లోబల్‍గా అత్యధిక వ్యూస్ దక్కించుకుంది. చిన్నచిన్న గేమ్‍లతోనే ఉత్కంఠభరితంగా సాగిన ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్‍ను 2024లోనే స్ట్రీమింగ్‍కు తెస్తామని నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ చేసింది. అయితే, రిలీజ్ డేట్‍ను వెల్లడించలేదు. ఇప్పటికే ఈ సెకండ్ సీజన్ ఫస్ట్ లుక్‍ను రిలీజ్ చేసింది. అయితే, స్క్విడ్ గేమ్ రెండో సీజన్ రిలీజ్ విండో గురించి తాజాగా అప్‍డేట్ చక్కర్లు కొడుతోంది.
అప్పుడే ఇక
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ 2024 రెండో అర్ధభాగంలో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ అప్‍డేట్‍ను కామిక్‍బుక్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే, ఏ నెలలో వచ్చే అవకాశం ఉందో మాత్రం కచ్చితంగా పేర్కొనలేదు. అయితే, జూలై నుంచి అక్టోబర్ మధ్య ఎప్పుడైనా స్క్విడ్ గేమ్ సీజన్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ 2024 తొలి అర్ధ భాగంలోనే వచ్చే అవకాశం ఉందని గతంలో రూమర్లు వచ్చాయి. అయితే, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు.. రెండో అర్ధ భాగంలో రావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ కోసం ప్రేక్షకులు మరింత కాలం వేచిచూడాల్సిందే.
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍లో లీ జంగ్ జయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేస్తున్న సీయంగ్ జీహన్ క్యారెక్టర్‌కు సంబంధించి రెండో సీజన్ ఫస్ట్ లుక్‍ను రెండు నెలల క్రితం నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. దాంతోపాటే 2024లోనే ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్‍కు వస్తుందని దాదాపు క్లారిటీ ఇచ్చింది.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్‍లో లీ జంగ్ జయీతో పాటు లీ బ్యుంగ్ హన్, వీ హాజూన్, జంగ్ యూ, ఇమ్ సివాన్ సహా మరికొందరు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొత్త ప్లేయర్లు కూడా ఈ సీజన్‍లో కనిపించనున్నారు. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహిస్తున్నారు.
స్క్విడ్ గేమ్ గురించి..
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2021 సెప్టెంబర్‌లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. 9 ఎపిసోడ్లు ఉన్న ఈ కొరియన్ డిస్టోపియన్ డ్రామా నరాలు తెగే ఉత్కంఠతో ప్రేక్షకులను మెప్పించింది. చిన్నచిన్న గేమ్‍లతో ఉండే ఈ సిరీస్ సస్సెన్స్‌గా సాగుతుంది. డబ్బు కోసం 455 మంది ఈ గేమ్స్ ఆడేందుకు వస్తారు. అయితే, గేమ్‍లో గెలిస్తేనే ప్రాణాలతో తదుపరి గేమ్‍కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే ఎలిమినేషన్ పేరుతో ఆ కంటెస్టెంట్‍ను నిర్వాహకులు చంపేస్తారు. ఇలా.. గెలుపు.. లేకపోతే చావు అంటూ ఉత్కంఠగా ఈ సిరీస్ సాగింది. ఇంత సస్పెన్స్, ఎమోషన్ల మధ్య సాగిన స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ బంపర్ సక్సెస్ అయింది. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‍గా రికార్డు సృష్టించింది.