Physical Abuse on Anicka Vikraman: నటిని ముఖం వాచిపోయేలా కొట్టిన ప్రియుడు.. ఎలా ఉండాల్సింది ఎలా అయిందో చూడండి-south actress anicka vikraman attacked by her ex boy friend anoop pillai and shares injury photos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Physical Abuse On Anicka Vikraman: నటిని ముఖం వాచిపోయేలా కొట్టిన ప్రియుడు.. ఎలా ఉండాల్సింది ఎలా అయిందో చూడండి

Physical Abuse on Anicka Vikraman: నటిని ముఖం వాచిపోయేలా కొట్టిన ప్రియుడు.. ఎలా ఉండాల్సింది ఎలా అయిందో చూడండి

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 07:36 AM IST

Physical Abuse on Anicka Vikraman: సౌత్ నటి అనిక విక్రమన్‌ను ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపరిచాడు. దారుణంగా కొట్టడంతో ఆమె ముఖం వాచిపోయింది. ఎంతో అందంగా ఉండే ఆమె ముఖం తీవ్రంగా కమిలిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నటిని ముఖం వాచిపోయేలా కొట్టిన ప్రియుడు
నటిని ముఖం వాచిపోయేలా కొట్టిన ప్రియుడు

Anicka Vikraman attacked by her Ex boy friend: లైంగిక వేధింపులు, భౌతిక దాడులు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. చాలా మంది సెలబ్రెటీలు తమపై దాడి జరిగిందంటూ పబ్లిక్ గానే తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. తాజాగా సౌత్ నటి అనిక విక్రమన్ కూడా తనకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనను తీవ్రంగా కొట్టాడని, మానిసకంగా హింసించాడంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అంతేకాకుండా ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన తన ఫొటోలను కూడా షేర్ చేసింది. ముఖం వాచిపోయేలా కొట్టినట్లున్న ఆ ఫొటోలను చూస్తుంటే ఎవ్వరకైనా మనస్సు ద్రవించిపోతుంది.

తన బాయ్ ఫ్రెండ్ పేరు అనూప్ పిళ్లై అని.. అతడితో రిలేషన్‌షిప్‌లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని స్పష్టం చేసింది. తనను మానసికంగా, శారీరంగా ఎంతో టార్చర్ అనుభవించానని పేర్కొంది. ఇప్పటికే తనపై చాలాసార్లు భౌతిక దాడి చేశాడని స్పష్టం చేసింది. తనపై దాడి గురించి వివరణాత్మకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది అనిక.

"నేను అనూప్ పిళ్లై అనే వ్యక్తిని ప్రేమించాను. అతడు గత కొన్నేళ్లుగా నన్ను మానసికంగా, భౌతికంగా హింసిస్తున్నాడు. అలాంటి మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. నన్ను ఎంతో భయపెట్టేవాడు. కలలో కూడా నాకు ఇలా జరుగుతుందని ఊహించలేదు. మొదటి సారి నన్ను అతడు చెన్నైలో ఉన్నప్పుడు తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత కాళ్ల మీద పడి క్షమాపణలు వేడుకున్నాడు. నేను అనవసరంగా అతడిని అప్పుడు వదిలేశాను. రెండో సారి బెంగళూరులో కొట్టాడు. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని వదిలేయమని నాతో అంటారనే నమ్మకంతో ఇంకా స్వేచ్ఛగా కొట్టేవాడు. గత కొన్నేళ్లుగా నేను చాలాసార్లు మోసపోయాను. కాబట్టి అతడిని వదిలి వెళ్లిపోవాలనుకున్నాను. కానీ తను నన్ను వదలానుకోవట్లేదు. మేము స్నేహితులమే.. దాని గురించి ఎలాంటి సందేహం లేదు. అతడు నా ఫోన్ పగలకొట్టాడు. అప్పటి నుంచి షూట్‌కు వెళ్లలేకపోయాను. నాకు తెలియకుండానే తన ల్యాప్‌ట్యాప్‌కు కనెక్ట్ చేసి నా వాట్సాప్ సందేశాలన్నింటిని చూస్తున్నాడు." అని అనిక విక్రమన్ తన పోస్టులో పేర్కొంది.

"ఈ ఘటనలను పక్కకబెట్టి నా పని నేను చూసుకుంటే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను, నా కుటుంబాన్ని నిరంతరం వేధిస్తున్నాడు. పూర్తిగా కోలుకోడానికి నెల రోజులు పట్టింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. షూటింగ్స్‌కు వెళ్తున్నాను. అతడి నుంచి మల్లీ బెదిరింపులు వస్తాయని వీటిని పోస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. న్యూయార్క్‌లో ఉన్నాడు." అని అనిక విక్రమన్ తన పోస్టులో స్పష్టం చేసింది.

బెంగళూరుకు చెందిన అనిక విక్రమన్ తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తుంది. కే, ఎంగ పట్టాన్ పర్తియా లాంటి సినిమాల్లో నటించి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దాడి తర్వాత నటి అనిక పరిస్థితి
దాడి తర్వాత నటి అనిక పరిస్థితి
WhatsApp channel

సంబంధిత కథనం