Bigg Boss Remuneration: బిగ్‍బాస్ ద్వారా సోనియా ఎంత సంపాదించారంటే.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఇదే!
Bigg Boss Soniya Remuneration: బిగ్‍బాస్ నుంచి సోనియా ఆకుల ఔట్ అయ్యారు. నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. నాలుగు వారాల్లో బిగ్‍బాస్ ద్వారా ఆమె ఎంత రెమ్యూనరేషన్ పొందారో ఇక్కడ చూడండి.
సినీ నటి సోనియా ఆకుల.. బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‍లో వాగ్వాదాలు, గొడవలతో బాగా హైలైట్ అయిన ఆమె నాలుగో వారంలోనే ఔట్ అయ్యారు. అనూహ్యంగా హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. చాలా మంది ప్రేక్షకులతో పాటు హౌస్‍మేట్లలోనూ సోనియాకు నెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్ కాకతప్పలేదు. అయితే, బిగ్‍బాస్ హౌస్‍లో నాలుగు వారాలు ఉన్న సోనియాకు మంచి రెమ్యూనరేషన్ అందనుంది.
ఎంత దక్కనుందంటే..
బిగ్‍బాస్ హౌస్‍లో సోనియా నాలుగు వారాలు ఉన్నారు. ఒక్కో వారానికి రూ.1.50లక్షల రెమ్యూనరేషన్ దక్కేలా హౌస్‍లోకి సోనియా అడుగుపెట్టారని సమాచారం. సీజన్‍కు ముందే ఈ కాంట్రాక్ట్ జరిగింది. దీంతో బిగ్‍బాస్ హౌస్‍లో నాలుగు వారాలు ఉన్న సోనియాకు రెమ్యూనరేషన్ ద్వారా రూ.6లక్షలు దక్కనుందని తెలుస్తోంది. బిగ్‍బాస్ ద్వారా ఆమె ఇంత మొత్తం సంపాదించారు.
మోడల్‍గా కెరీర్ ఆరంభించిన సోనియా ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో అడుగుపెట్టారు. 2019లో జార్జి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. ఆ తర్వాతి సంవత్సరం డైరెక్టర్ రామ్‍గోపాల్ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో సోనియా బాగా ఫేమస్ అయ్యారు. ఆశా ఎన్‍కౌంటర్ చిత్రంలోనూ నటించారు. మంచి ఫేమ్‍తో బిగ్‍బాస్ హౌస్‍లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. అయితే, నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు.
హౌస్‍లోనూ వ్యతిరేకత
తరచూ గొడవలు పడడం, కొన్ని సందర్భాల్లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, నిఖిల్, పృథ్విరాజ్ ఆటను చెడగొడుతున్నారనే కారణాలతో సోనియాపై మెజార్టీ ప్రేక్షకుల్లో నెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో గ్రాఫ్ బాగా పడిపోయింది. నాలుగు వారం నామినేషన్లలో ఉన్న ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో హౌస్ నుంచి బయటికి వచ్చేశారు.
అయితే, హౌస్‍లోనూ సోనియాపై నెగెటివిటీ బాగా ఎక్కువగా ఉందని ఎలిమినేషన్ ప్రక్రియలో అర్థమైంది. సోనియా, మణిల్లో హౌస్‍లో ఎవరు ఉండాలని కంటెస్టెంట్లను నాగార్జున అడిగారు. నిఖిల్, పృథ్వి, నైనిక మాత్రమే సోనియాకు ఉండాలని అభిప్రాయపడ్డారు. మణికంఠ ఉండాలని కిర్రాక్ సీత, నబీల్ ఆఫ్రిది, ఆదిత్య ఓం, ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి చెప్పారు. హౌస్‍లో ఎక్కువ మంది సభ్యులు కూడా సోనియాకు వ్యతిరేకంగా నిలిచారు. దీంతో ప్రేక్షకుల ఓట్లతో పాటు హోస్‍మేట్స్ అభిప్రాయం తీసుకున్న నాగార్జున.. సోనియా ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
తాను నిఖిల్, పృథ్విరాజ్‍ను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని హౌస్ నుంచి వేదిక మీదకు వచ్చాక సోనియా చెప్పేశారు. ఈ విషయంలో తనపై నెగెటివిటీ బాగా పెరిగిందని గుర్తించిన ఆమె ఈ కామెంట్స్ చేశారు. నిఖిల్, పృథ్వి తన మాటల వినరని, తాను కేవలం సలహాలే ఇచ్చానని అన్నారు. సోనియా ఎలిమినేట్ అవటంతో నిఖిల్ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో నాలుగు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఎలిమినేట్ అయ్యారు. హౌస్‍లో ప్రస్తుతం పది మంది ఉన్నారు. అయితే, త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా కొందరు గత సీజన్ల మాజీ కంటెస్టెంట్లు హౌస్‍లో అడుగుపెట్టనున్నారు. అయితే, ఈ సీజన్‍లో ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్‍ను కూడా తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందనే రూమర్లు ఉన్నాయి. దీంతో సోనియా రీఎంట్రీ ఇస్తారనే రూమర్లు ఉన్నాయి. సోనియా కాకపోతే శేఖర్ బాషా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.