Sonakshi Sinha Wedding: ప్రేమే పెద్ద మతం: ముస్లింని పెళ్లి చేసుకోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు బాలీవుడ్ నటి సమాధానం-sonakshi sinha wedding bollywood actress reacted to trolls for being married to a muslim ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha Wedding: ప్రేమే పెద్ద మతం: ముస్లింని పెళ్లి చేసుకోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు బాలీవుడ్ నటి సమాధానం

Sonakshi Sinha Wedding: ప్రేమే పెద్ద మతం: ముస్లింని పెళ్లి చేసుకోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు బాలీవుడ్ నటి సమాధానం

Hari Prasad S HT Telugu
Jun 26, 2024 11:05 AM IST

Sonakshi Sinha Wedding: ముస్లిం వ్యక్తితో పెళ్లిపై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా పరోక్షంగా స్పందించింది. శ్రేయోభిలాషుల అభినందన పోస్ట్ పై సోనాక్షి చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రేమే పెద్ద మతం: ముస్లింని పెళ్లి చేసుకోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు బాలీవుడ్ నటి సమాధానం
ప్రేమే పెద్ద మతం: ముస్లింని పెళ్లి చేసుకోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు బాలీవుడ్ నటి సమాధానం

Sonakshi Sinha Wedding: జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది సోనాక్షి సిన్హాను, ఆమె కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఆమె స్నేహితులు, సన్నిహితులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

ట్రోలింగ్ ను నివారించడానికి సోనాక్షి, జహీర్ తమ ఇన్ స్టాగ్రామ్ లోని కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. ఇప్పుడు సోనాక్షి తాజాగా ఓ పోస్ట్ లో ప్రేమకు మతం లేదని పరోక్ష సందేశం ఇచ్చింది. ఓ శ్రేయోభిలాషి పోస్టుపై సోనాక్షి చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రేమే పెద్ద మతం

సోనాక్షి ఓ ముస్లిం అయిన జహీర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె సన్నిహితులు వరుసగా ఇలాంటి పోస్టులు చేస్తూ ట్రోల్స్ కు పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. సోనాక్షి శ్రేయోభిలాషుల్లో ఒకరు జహీర్ తో కలిసి దిగిన ఫొటోను క్యారికేచర్ రూపొందించారు.

ప్రేమ విశ్వజనీనమైన మతం అనే క్యాప్షన్ తో దీనిని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సోనాక్షి, జహీర్ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ.. చాలా కరెక్ట్ విషయం. చాలా క్యూట్ గా ఉంది, ధన్యవాదాలు అని అనడం విశేషం.

సోనాక్షి, జహీర్ పెళ్లి

ఇలా సోనాక్షి తనపై వస్తున్న ట్రోల్స్ కు పరోక్షంగా సమాధానం చెప్పినట్లయింది. పెళ్లి తర్వాత సోనాక్షి చేసిన మొదటి పోస్ట్ లో జహీర్, తాను తమ తమ దేవుళ్లే సాక్షులుగా ఒకరినొకరు అంగీకరించామని చెప్పింది. ఈ బంధం దేవుడి సంకల్పంతోనే జరిగిందని మరో పోస్ట్ లో పేర్కొన్నారు.

సోనాక్షి స్నేహితురాలు బాలీవుడ్ నటి అయిన రిచా చద్దా కూడా ఈ ట్రోల్స్ కు చెక్ పెడుతున్న వారిని అభినందించారు. జహీర్, సోనాక్షి తమ మనసు మాట విని పెళ్లి చేసుకోవడం బాగుందని ఆమె అభిప్రాయపడింది. రిచా, సోనాక్షి కలిసి ఈ మధ్యే హీరామండి వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.

సోనాక్షి తన లవ్ స్టోరీని కూడా పోస్ట్ లో రాసింది. ఏడేళ్ల క్రితం జూన్ 23న తాను, జహీర్ ఒకరి కళ్లలో మరొకరు ప్రేమను చూశామని చెప్పింది. అందుకే పెళ్లి కోసం ఈ తేదీని ఎంచుకున్నానని తెలిపింది. వీళ్ల పెళ్లిని సోనాక్షి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు శత్రఘ్ను కూడా పెళ్లికి వచ్చాడు. ఈ కాలం పిల్లలు కేవలం సమాచారం ఇస్తారు తప్ప అనుమతి తీసుకోరని పెళ్లికి ముందు అతడు అనడంతో సోనాక్షి పెళ్లి వాళ్లకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది.

Whats_app_banner