తెలుగు న్యూస్ / ఫోటో /
Sonakshi Sinha Wedding Photoshoot: ముద్దులు కురిపించుకున్న బాలీవుడ్ కొత్త దంపతులు సోనాక్షి, జహీర్: ఫొటోలు
- Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ ఆదివారం (జూన్ 23) వివాహం చేసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోషూట్‍ను నేడు (జూన్ 25) సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనాక్షి.
- Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ ఆదివారం (జూన్ 23) వివాహం చేసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోషూట్‍ను నేడు (జూన్ 25) సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనాక్షి.
(1 / 7)
నటి సోనాక్షి సిన్హా, రచయిత జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల ప్రేమ తర్వాత ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆదివారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫొటోషూట్‍ను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో సోనాక్షి పోస్ట్ చేశారు.
(2 / 7)
ఈ ఫొటోషూట్‍లో పరస్పరం ముద్దులు కురిపించుకొని తమ ప్రేమను వ్యక్తం చేశారు సోనాక్షి, జహీర్ ఇక్బాల్. జహీర్ నుదిటిపై సోనాక్షి ఆప్యాయంగా ముద్దుపెట్టారు.
(3 / 7)
సోనాక్షి నుదుటిపై కూడా జహీర్ కిస్ చేశారు. వీరిద్దరి జోడీ అదిరిపోయింది. ఈ ఫొటోలను సోనాక్షి ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఒకరిని ఒకరం పొందడం పట్ల తాము ఇద్దరం అదృష్టవంతులమని ఆమె క్యాప్షన్ రాశారు. తమ మధ్య ప్రేమ అపారంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
(4 / 7)
ఈ ఫొటో షూట్‍లో సోనాక్షి రెడ్ కలర్ చీర కట్టుకున్నారు. మెడలో నక్లెస్, పూలు పెట్టుకున్నారు. వైట్ కలర్ కుర్తా, పైజామా ధరించారు జహీర్.
(5 / 7)
ఏడేళ్ల ప్రేమ తర్వాత ఇప్పుడు తాము భార్యభర్తలం అయ్యామంటూ పెళ్లి తర్వాత ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు సోనాక్షి. తమ ఇద్దరి కుటుంబాలు, ఇద్దరు దేవుళ్ల ఆశీర్వాదాలతో తమ పెళ్లి జరిగిందని తెలిపారు.
(6 / 7)
ముంబైలోని ఇంట్లో పెళ్లి తర్వాత ఓ రెస్టారెంట్లో బాలీవుడ్ సెలెబ్రిటీలు, సన్నిహితులకు గ్రాండ్‍గా రిసెప్షన్ పార్టీ ఇచ్చారు సోనాక్షి, జహీర్ ఇక్బాల్. సల్మాన్ ఖాన్, కాజోల్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, రేఖ, టబు, హుమా ఖురేషి, సంజయ్ లీలా భన్సాలీ చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు