Monkey Man OTT: శోభిత ధూళిపాళ్ల హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Monkey Man OTT: శోభిత దూళిపాళ్ల హాలీవుడ్ డెబ్యూ మూవీ మంకీ మ్యాన్ ఓటీటీలో రిలీజయ్యేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మే సెకండ్ వీక్‌లో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Monkey Man OTT: మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ్ల. స్లమ్‌డాగ్ మిలయనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వేశ్య పాత్రలో శోభిత ధూళిపాళ్ల నటించింది. ఏప్రిల్ 5న అమెరికా, కెనాడతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్‌మూవీ రిలీజైంది. ఇండియాలో ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కాగా ఇండియాలో థియేటర్లలో విడుదలైన రెండు వారాల తర్వాత మంకీ మ్యాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మంకీ మ్యాన్ వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. మే 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మే ఫస్ట్ వీక్‌లో మంకీ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు చెబుతోన్నారు.
పురాణాల స్ఫూర్తితో...
భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మ్యాన్ కథను రాసుకున్నాడు. నైట్‌క్లబ్‌లో ఫైటర్‌గా పనిచేసే ఓ యువకుడి జీవితం చుట్టూ ఈ కథ సాగుతుంది. జీవితంలో తనకు ఎదురైన పరాభవాలు, అవమానాలకు అతడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది యాక్షన్ అంశాలతో దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.
బోల్డ్ క్యారెక్టర్‌లో
హీరో రివేంజ్‌కు సాయపడే ఓ బోల్డ్ పాత్రలో శోభిద ధూళిపాళ్ల న టించింది. లెంగ్త్ పరంగా చిన్న క్యారెక్టర్ అయినా తన గ్లామర్, యాక్టింగ్‌తో హాలీవుడ్ ఫ్యాన్స్ మనుసుల్ని దోచుకుంది శోభిత ధూళిపాళ్ల. పది మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన మంకీ మ్యాన్ మూవీ ఇరవై ఐదు మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా దేవ్‌పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. ఈ హాలీవుడ్ మూవీలో చాలా మంది భారతీయ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
ఎనిమిదేళ్లలో 12 సినిమాలు...
2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన రమణ్ రాఘవ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ్ల. ఎనిమిదేళ్ల కెరీర్‌లో కేవలం 12 సినిమాలు మాత్రమే చేసింది. యాక్టింగ్ కంటే గ్లామర్‌తోనే అభిమానులకు చేరువైంది. బాలీవుడ్‌కు పరిమితం కాకుండా దక్షిణాదిలో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తన లక్‌ను పరీక్షించుకున్నది.
గూఢచారితో...
అడివి శేష్ గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. ఆ తర్వాత అతడితోనే మేజర్ మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయిన టాలీవుడ్‌లో శోభిత దూళిపాళ్లకు ఆశించిన మేర అవకాశాలు రాలేదు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో ఓ కీలక పాత్ర చేసింది. హిందీలో మేడ్ ఇన్ హెవెన్‌తో పాటు నైట్ మేనేజర్స్ సిరీస్‌లో గ్లామర్ రోల్స్ చేసింది శోభిత దూళిపాళ్ల. ప్రస్తుతం హిందీలో సితార పేరుతో రొమాంటిక్ లవ్‌స్టోరీ చేస్తోంది శోభిత. నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవ్‌పటేల్ హాలీవుడ్‌లోకి ఇరవైకిపైగా సినిమాలు చేశాడు.