Ayalaan Telugu OTT: థియేటర్ సీన్ రిపీట్ - ఓటీటీలో కూడా తెలుగులో రిలీజ్ కాని అయలాన్ - కారణం ఇదేనా!
Ayalaan Telugu OTT: శివకార్తికేయన్ అయలాన్ మూవీ తమిళ వెర్షన్ శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు. మరో పది పన్నెండు రోజుల తర్వాత తెలుగు వెర్షన్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలిసింది.
Ayalaan Telugu OTT: అయలాన్ తమిళ వెర్షన్ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సన్ సెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవకముందే శుక్రవారం అయలాన్‌తో పాటు కెప్టెన్ మిల్లర్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, శివకార్తికేయన్ నటించిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ కావడం హాట్‌టాపిక్‌గా మారింది.
నో తెలుగు రిలీజ్...
కాగా అయలాన్ తమిళ వెర్షన్ మాత్రమే సన్ నెక్స్ట్‌లో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయలేదు. తొలుత రెండు భాషల్లో విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కేవలం తమిళ వెర్షన్‌ను మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
షారుఖ్ ఖాన్ కారణంగా...
అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న థియేటర్లలో విడుదలకావాల్సింది. కానీ ఫైనాన్షియల్ ఈష్యూస్ వల్ల చివరి నిమిషంలో ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి అయలాన్ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులనుషారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ఛీల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ అందించినట్లు తెలిసింది. ఈ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు వర్క్‌కు సంబంధించి ప్రొడ్యూసర్స్ భారీగా షారుఖ్ కంపెనీకి బకాయిపడినట్లు ప్రచారం జరిగింది. అందుకే తెలుగు రిలీజ్‌ను రెడ్ ఛిల్లీస్ కంపెనీ అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి.
థియేటర్ రిలీజ్ లేకుండా....
థియేటర్లలో రిలీజైన సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందాన్నిడిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పాటిస్తున్నాయి. ఆ ఒప్పందం కారణంగానే అయలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాలేదని అంటున్నారు. ఈ ఇష్యూస్‌ను సాల్వ్ చేసి తొందరలోనే తెలుగు వెర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 22 నుంచి తెలుగు వెర్షన్ అయలాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‌పై సన్ నెక్స్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
అయలాన్ రివ్యూ
అయలాన్ సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్‌హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఆర్ రవికుమార్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తామిజ్ (శివకార్తికేయన్) అనే రైతు పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. జాబ్ కోసం సిటీకి వచ్చిన అయలాన్‌కు టాట్టూ అనే ఏలియన్‌తో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది.ఫ్యూయల్‌కు ప్రత్యామ్నాయంతో నోవా గ్యాస్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్
ఆర్యన్ (శరద్ ఖేల్కర్). నోవా గ్యాస్‌ను వెలికితీయాడానికి స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు. ఆఫ్రికాలో అతడు చేసిన ప్రయోగం వికటించి వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. మరోసారి ఇండియాలోనే ఎవరికి తెలియకుండా ఓ మైన్‌లో రహస్యంగా నోవా గ్యాస్ ప్రయోగం చేస్తుంటాడు ఆర్యన్. అతడి దగ్గర ఉన్న స్పార్క్ ను తామిజ్ సహాయంతో ఏలియన్ ఎలా సొంతం చేసుకున్నది. ఆర్యన్‌ను ఏలియన్ టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? ఆర్యన్ చేసిన ప్రయోగం కారణంగా చెన్నై నగరం ఎలా అతలాకుతలం అయ్యింది. అతడి ప్రయోగాన్ని తామిజ్, ఏలియన్ ఏ విధంగా అడ్డుకున్నారన్నదే అయలాన్ మూవీ కథ.