Sitara Ghattamaneni : జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా సితార.. ఇలా ఇండియాలోనే ఫస్ట్ టైమ్
Sitara Ghattamaneni : సితార ఘట్టమనేని.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు కుమార్తెగా అందరికీ సుపరిచితమే. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సితార సైన్ చేసింది.
మహేశ్ బాబు(Mahesh Babu), నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార. చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్. సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంది. అప్పుడప్పుడు కొన్ని డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోకి రాకున్నా.. తనకంటూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది ఈ స్టార్ కిడ్. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌ను ఆమోదించి అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్(Ad Contract)పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది.
సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) ఇప్పుడు ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అయింది. ఈ ఒప్పందంలో భాగంగా.. సితార భారీగా రెమ్యునరేషన్(Remuneration) తీసుకుంటుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇటీవల 3 రోజుల పాటు ఒక రహస్య ప్రదేశంలో యాడ్ ఫిల్మ్(Ad Film) కూడా చిత్రీకరించారు. భారతదేశంలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ కమర్షియల్ షూట్‌లో పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో టెలివిజన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాడ్ ప్లే కానుంది. యాడ్ షూట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Super Star Mahesh Babu) సినిమాలకే పరిమితం కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గానూ దూసుకెళ్తున్నాడు. తండ్రినే ఫాలో అయిపోతుంది సితార. గతంలో యానిమేషన్ త్రీడీ వెబ్ సిరీస్ ఫంటాస్టిక్ తారకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. అప్పుడు కూడా ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఫంటాస్టిక్ తార కార్యక్రమాన్ని అప్పుడు హైదరాబాద్ లో నిర్వహించగా.. తల్లి నమ్రతాతోపాటుగా సితార పాల్గొంది.
చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో సితార యాక్టివ్ గా ఉంటుంది. ఆకట్టుకునే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఏ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి.. మహేశ్ బాబును ఓ సారి ఇంటర్వ్యూ కూడా చేశారు. పలు హిట్ సాంగ్స్ కు డాన్స్ లు కూడా చేసి ఆ వీడియోలను నెట్టింట్లో పెడుతుంది సితార. డ్యాన్స్ మాస్టర్ యానీతో చేసిన కొన్ని వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అందరినీ ఆకట్టుకుంటూ యాక్టివ్ గా ఉండే సితార ఇప్పుడు ఓ పెద్ద జ్యువెలరీ కంపెనీకి ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ గా అవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
టాపిక్