IPL Points Table 2024: థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న ప్లేఆఫ్స్ రేసు - ఎనిమిది టీమ్‌లలో గెలిచేది..నిలిచేది ఎవరు?
IPL Points Table 2024: ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. కోల్‌కతా, రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా...మిగిలిన స్థానాల కోసం ఆరు టీమ్‌లు పోటీపడుతోన్నాయి.

IPL Points Table 2024: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచిన కోల్‌కతా, రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. మిగిలిన మూడు, నాలుగు స్థానాల కోసం ఐదు టీమ్‌లు పోటీపడుతోన్నాయి. ఈ రెండు బెర్తులు ఎవరికి దక్కుతాయన్నది థ్రిల్లింగ్‌గా మారింది. ప్లేఆఫ్స్ బెర్తు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య గట్టి పోటీనెలకొంది. పోటాపోటీగా సాగుతోన్న ప్లేఆఫ్స్ రేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
కోల్‌కతా టాప్...
ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిది విజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కోల్‌కతాతో సమానంగా విజయాలు సాధించిన రాజస్థాన్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. పదహారు పాయింట్లతో ఈ రెండు జట్టు ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి.
సన్‌రైజర్స్ మూడో ప్లేస్...
14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచుల్లో పంజాబ్, ఢిల్లీలతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే...మిగిలిన జట్లతో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తుకు ఢోకా ఉండదు. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు సన్‌రైజర్స్ తర్వాత చెన్నైకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో ఉన్న ఈ జట్టు మూడింటిలో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. కనీసం రెండింటిలో గెలిచినా కూడా ప్లేఆఫ్స్ రేసులోకి అడుగుపెట్టేందుకు చెన్నైకి అవకాశం ఉంటుంది.
లక్నో, ఢిల్లీ కూడా...
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా తలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు టీమ్‌లు పన్నెండు పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటాయి. అప్పుడు రన్‌రేట్ ప్రకారం ఏది ప్లేఆఫ్స్‌కు చేరకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆర్‌సీబీ అవకాశాలు తక్కువే...
ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు చెన్నైకి అతి తక్కువగా ఉన్నాయి. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో చెన్నై, ఢిల్లీలతో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ మ్యాచుల్లో గెలిస్తే ఆర్‌సీబీ పాయింట్స్ పది నుంచి పధ్నాలుగుకు చేరుకుంటాయి. మిగిలిన జట్లు ఓటములపైనే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అద్భుతాలు జరిగితే ముంబై కూడా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. కానీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి.
చెన్నై గెలిస్తేనే...
నేడు (శుక్రవారం) ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై తప్పక గెలవాలి. మరోవైపు పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరవు నిలుపుకోవాలని భావిస్తోంది.