SSMB 28 Nizam Rights : మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబో క్రేజ్.. భారీ ధరకు నైజాం రైట్స్
SSMB 28 Nizam Rights : సూపర్ స్టార్ మహేశ్ బాబు, గురూజీ త్రివిక్రమ్ క్రేజీ కాంబో అంటే ఫ్యాన్స్ కు పండగే. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే జస్ట్ ఈ కాంబినేషన్ పేరు మీదనే కోట్ల బిజినెస్ అవుతోంది. ఎస్ఎస్ఎంబీ 28కి సంబంధించి నైజాం రైట్స్ అమ్ముడుపోయాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కలయికలో సినిమా పట్టాలెక్కింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో తాత్కాలికంగా SSMB 28 పేరుతో కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. ఆగస్టు 11, 2023న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(Dil Raju) నైజాం రైట్స్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు. సుమారు రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి దిల్ రాజు నుంచి లేదా SSMB 28 టీమ్ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో జగపతి బాబు కూడా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమైంది. మెుదట క్రిస్మస్‌కు ముందు ఓ చిన్న షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేశారట. ఐదు ఆరు రోజుల ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ తర్వాత.. మహేష్‌తో మీటింగ్ తర్వాత మొత్తం ప్లాన్ మారింది. జనవరిలో షూటింగ్ మెుదలైంది. మహేష్ బాబుపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. మార్చి 30 వరకు ఏకధాటిగా షూటింగ్‌ను జరుపనున్నట్టుగా తెలుస్తోంది.
మహేష్‌బాబు, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. మరోవైపు షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకొంది. ఈ సినిమా డిజిటల్‌రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.