Mahesh Babu Foundation Website: మహేష్ ఫౌండేషన్ వెబ్ సైట్ ప్రారంభం.. పాకెట్ మనీ డొనేట్ చేసిన సితార
Mahesh Babu Foundation Website: మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో మన సూపర్ స్టార్ మహేష్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫౌండేషన్‌కు సితార ఘట్టమనేని కూడా తన దానం చేసింది. తన పాకెట్ మనీని విరాళంగా ఇచ్చింది.
Mahesh Babu Foundation Website: మహేష్ బాబు.. హీరోగానే కాకుండా సేవా గుణంలోనూ ఎంతో ముందుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా వేలాది మంది చిన్నారులకు గుండె జబ్బులను నయం చేశారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మహేష్ లానే ఆయన కుమార్తే సితారా కూడా తండ్రి నుంచి సేవా గుణాన్ని పునికిపుచ్చుకుంది. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్న ఈ చిన్నారి.. తాజాగా సరికొత్త ముందడుగు శ్రీకారం చుట్టింది.
ట్రెండింగ్ వార్తలు
మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు సితార తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా తన వంతుగా తన పాకెట్ మనీని దానం చేస్తున్నట్లు ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కార్యక్రమంతో ముందుకు వచ్చింది. maheshbabufoundation.org అనే పోర్టల్‌ను ప్రారంభించింది.
"ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్ సైట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. పిల్లల జీవనం, అభివృద్ధి కోసం చేసే మా ప్రయత్నంలో ఈ సైట్‌ను తీసుకొస్తున్నాం" అని ట్విటర్ వేదికగా తెలియజేసింది.
ప్రస్తుతం మహేష్ బాబు నూతన సంవత్సరం సందర్భంగా స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌లో ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకున్నారు. వర్క్ విషయానికొస్తే మహేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాది కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్