Siddhu Jonnalagadda: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో డీజే టిల్లు - అప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ - ఇప్పుడు గెస్ట్!-siddu jonnalagadda plays a cameo in ravi teja mister bachchan dj tillu bhagyashri borse tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddhu Jonnalagadda: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో డీజే టిల్లు - అప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ - ఇప్పుడు గెస్ట్!

Siddhu Jonnalagadda: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో డీజే టిల్లు - అప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ - ఇప్పుడు గెస్ట్!

Nelki Naresh Kumar HT Telugu
Aug 03, 2024 08:32 AM IST

Siddhu Jonnalagadda: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో ర‌వితేజ‌తో క‌లిసి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అభిమానుల‌కు క‌నిపిస్తాడ‌ని అంటున్నారు.

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ
సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ

Siddhu Jonnalagadda: ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన హైద‌రాబాద్‌లో ఓ సాంగ్ షూట్ జ‌రుగుతోంది. ఈ పాట‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

డీజే టిల్లు గెస్ట్‌...

కాగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో ర‌వితేజ‌తో క‌లిసి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కొన్ని నిమిషాల పాటు స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ గెస్ట్ రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ఇటీవ‌లే పూర్తిచేసిన‌ట్లు తెలిసింది. అత‌డి గెస్ట్ అప్పీరియెన్స్ ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండేలా మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. గ‌తంలో ర‌వితేజ హీరోగా న‌టించిన డాన్ శీను సినిమాలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. ఇప్పుడు ర‌వితేజ మూవీలోనే గెస్ట్ పాత్ర చేయనుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

భాగ్య‌శ్రీ బోర్సే కెమిస్ట్రీ...

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్‌, సాంగ్స్‌లో త‌న గ్లామ‌ర్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది భాగ్య‌శ్రీ బోర్సే. సినిమాలో ర‌వితేజ‌తో భాగ్య‌శ్రీ బోర్సే కెమిస్ట్రీ హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో తెలుస్తోంది. . డిసెంబ‌ర్‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షూటింగ్ మొద‌లైంది. కేవ‌లం ఎనిమిదినెల‌ల్లోనే వ్య‌వ‌ధిలోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోర‌వితేజ ఈగ‌ల్ మూవీ రిలీజైంది. ఆరు నెల‌ల గ్యాప్‌లోనే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌తో మ‌రోసారి ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు ర‌వితేజ‌.

ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌...

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నార. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో ర‌వితేజ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ అక్ర‌మాస్తుల‌ను నిజాయితీప‌రుడైన ఇన్‌క‌మ్ టాక్స్ ఆఫీస‌ర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయ‌నే పాయింట్‌తో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

హ్యాట్రిక్ మూవీ...

ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో రాబోతున్న మూడో మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి షాక్‌, మిర‌ప‌కాయ్ సినిమాలు చేశారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త‌ర్వాత భాను భోగ‌వ‌ర‌పు అనే కొత్త ద‌ర్శ‌కుడితో ర‌వితేజ ఓ యాక్ష‌న్ డ్రామా మూవీ చేయ‌నున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ జ‌న‌వ‌రిలో లాంఛ్ అయ్యింది. సెప్టెంబ‌ర్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌...

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా చేస్తోన్నాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం, డిప్యూటీ సీఏం ప‌ద‌వి బాధ్య‌త‌ల‌తో బిజీగా ఉండ‌టంతో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ వాయిదాప‌డింది. ఈ గ్యాప్‌లోనే హ‌రీష్ శంక‌ర్ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీని పూర్తిచేయ‌డం గ‌మ‌నార్హం.