Shruti Haasan in Nani 30: చిరు, బాల‌య్య‌, ప్ర‌భాస్ ...ఇప్పుడు నాని మూవీ - శృతిహాస‌న్ లైన‌ప్ మామూలుగా లేదుగా-shruti haasan to star in nani 30th movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan In Nani 30: చిరు, బాల‌య్య‌, ప్ర‌భాస్ ...ఇప్పుడు నాని మూవీ - శృతిహాస‌న్ లైన‌ప్ మామూలుగా లేదుగా

Shruti Haasan in Nani 30: చిరు, బాల‌య్య‌, ప్ర‌భాస్ ...ఇప్పుడు నాని మూవీ - శృతిహాస‌న్ లైన‌ప్ మామూలుగా లేదుగా

Nelki Naresh Kumar HT Telugu
Apr 29, 2023 08:07 PM IST

Shruti Haasan in Nani: నాని హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను శ‌నివారం అనౌన్స్‌చేశారు. ఆ అప్‌డేట్ ఏదంటే...

శృతిహాస‌న్
శృతిహాస‌న్

Shruti Haasan in Nani: ప్ర‌స్తుతం శృతిహాస‌న్ గుడ్‌టైమ్ న‌డుస్తోంది. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాల‌తోబిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న‌ది శృతిహాస‌న్‌. ప్ర‌జెంట్ ప్ర‌భాస్‌తో స‌లార్ మూవీ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది.

నాని సినిమాలో శృతిహాస‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. నాని హీరోగా డెబ్యూడెంట్ డైరెక్ట‌ర్ శౌర్యూవ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌మూవీ తెర‌కెక్కుతోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతిహాస‌న్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న‌ట్లు శ‌నివారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

శ‌నివారం నుంచి ఆమె ఈ సినిమా షూటింగ్‌లో జాయినైన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నాని హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది. మ‌ల‌యాళ మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హృద‌యం ఫేమ్ హీష‌మ్ అబ్దుల్ వ‌హాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఈ సినిమా కిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్