Shruti Haasan: జీవితాంతం మందు ముట్టను - స్టేట్మెంట్ ఇచ్చిన శృతిహాసన్
Shruti Haasan: గతంలో తాను మందు తాగేదానినని, కానీ అందులో ఎలాంటి ఆనందం లేదని అర్థమైన తర్వాత ఆ అలవాటుకు దూరమయ్యానని శృతిహాసన్ చెప్పింది. తానేప్పుడూ డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్లలేదని శృతిహాసన్ చెప్పింది.
Shruti Haasan: లైఫ్‌లాంగ్ తాను మద్యపానానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు శృతిహాసన్ చెప్పింది. డగ్స్ జోలికి ఎప్పుడు వెళ్లలేదని తెలిపింది. డ్రగ్స్, పార్టీ కల్చర్‌పై శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తనకు తాగుడు అలవాటు ఉండేదని శృతిహాసన్ చెప్పింది. మందు తాగడంలో ఎలాంటి ఆనందం లేదనే విషయం అర్థమైందని, అప్పటి నుంచి ఆ ఆలవాటుకు దూరమయ్యానని చెప్పింది. గత ఎనిమిదేళ్లుగా మద్యపానానికి దూరంగా ఉంటున్నట్లు శృతిహాసన్ చెప్పింది.
“పార్టీలకు, మందుకు దూరమైనందుకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు ఎలాంటి హ్యాంగోవర్స్ లేవు. జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది” అని శృతిహాసన్ చెప్పింది. మళ్లీ జీవితంలో ఎప్పుడు మందు ముట్టకూడదని నిర్ణయించుకున్నట్లు శృతిహాసన్ చెప్పింది. తాగడం మానేసిన తర్వాత పార్టీలు, ఫ్రెండ్స్‌ను అవైయిడ్ చేయడం చాలా కష్టంగా మారిందని తెలిపింది. తాగడం అలవాటు ఉన్నా తానేప్పుడూ డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్లలేదని శృతిహాసన్ అన్నది. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారుతోన్నాయి.
ఈ ఏడాది మూడు సక్సెస్‌లు..
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో దూసుకుపోతుంది శృతిహాసన్. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకున్నది. ఇటీవల విడుదలైన నాని హాయ్ నాన్న సినిమాలో శృతిహాసన్ ఓ కీలక పాత్రలో కనిపించింది. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నది.