Trolls On Jawan : బాహుబలి, అపరిచితుడు, శివాజీ.. షారుక్ లుక్స్ అన్నీ కాపీనే.. జవాన్ సినిమాపై చర్చ!-shahrukh khan starrer jawan movie poses is copied netizens trolls ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trolls On Jawan : బాహుబలి, అపరిచితుడు, శివాజీ.. షారుక్ లుక్స్ అన్నీ కాపీనే.. జవాన్ సినిమాపై చర్చ!

Trolls On Jawan : బాహుబలి, అపరిచితుడు, శివాజీ.. షారుక్ లుక్స్ అన్నీ కాపీనే.. జవాన్ సినిమాపై చర్చ!

Anand Sai HT Telugu
Jul 11, 2023 10:55 AM IST

Jawan Cinema : జవాన్ సినిమా కోసం షారుక్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ చర్చ మెుదలైంది. షారుక్ లుక్స్ అన్నీ కాపీనే అని నెటిజన్లు అంటున్నారు.

జవాన్ సినిమాపై ట్రోల్స్
జవాన్ సినిమాపై ట్రోల్స్

జులై 10న విడుదలైన జవాన్ సినిమా(Jawan Cinema) ప్రివ్యూ సందడి చేస్తోంది. ఈ ప్రివ్యూని 20 గంటల్లో 4 కోట్ల మంది వీక్షించడం విశేషం. షారుక్ ఖాన్(Shahrukh Khan) చాలా గెటప్‌లలో కనిపించాడు. ఈ గెటప్‌లు వేర్వేరు సినిమాల నుండి దొంగిలించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఆరోపణలను షారుక్ అభిమానులు తోసిపుచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో జవాన్ సినిమా పనుల్లో షారుక్ ఖాన్ నిమగ్నమయ్యాడు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన పలువురు మెచ్చుకుంటున్నారు. అట్లీ(Atlee)తో షారుక్ ఖాన్ చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షారుక్ లుక్స్ అన్ని వేరే సినిమాల నుంచి దొంగిలించినవేనని కొంతమంది అంటున్నారు.

'జవాన్' ప్రివ్యూలో ఓ చిన్నారిని పైకి ఎత్తే సన్నివేశం ఉంది. చాలా మంది దీనిని బాహుబలి 2(Bahubali 2) సినిమాలోని ఓ సన్నివేశంతో పోల్చారు. షారుక్ ఖాన్ ముఖానికి మాస్క్ వేసుకునే సీన్ ఉంది. దీన్ని విక్రమ్ నటించిన అపరిచితుడుతో పోల్చారు. షారుక్ ఖాన్ ముఖానికి గుడ్డ చుట్టి ఉంది, అది 'డార్క్ మ్యాన్' సినిమాలోనిదని అంటున్నారు. షారుక్ ఖాన్ తలపై పూర్తిగా వెంట్రుకలు లేకుండా కనిపిస్తున్నాడు. శివాజీలో రజనీకాంత్‌(Rajinikanth) పాత్రతో దీన్ని పోల్చుతున్నారు నెటిజన్లు. మొత్తానికి సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది.

‘జవాన్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో జవాన్ ఇటీవల ట్రెండ్ అవుతోంది. తమిళ డైరెక్టర్ అట్లీ.. జవాన్ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్‍గా నటిస్తున్నాడు. నయనతార, ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె, దళపతి విజయ్, సంజయ్ దత్ కాసేపు ఈ చిత్రంలో కనిపిస్తారని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

సెప్టెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జ‌వాన్ మూవీ రిలీజ్(Jawan Movie Release) కానుంది. స్వీయ నిర్మాణ సంస్థలో దాదాపు 220 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జవాన్ చిత్రానికి నిర్మాతగా ఉంది. జేకే విష్ణు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా.. ఎడిటింగ్ బాధ్యతను రుబెన్ నిర్వర్తిస్తున్నాడు. హిందీలో రూపొందిన జవాన్ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లోకి డబ్బింగ్ కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024