Dunki Movie OTT : 'డంకీ' ఓటీటీ హక్కులకు ఫుల్ డిమాండ్.. 155 కోట్లకు షారుక్ ఖాన్ సినిమా సేల్!-shah rukh khan starrer dunki movie ott rights reportedly sold to jio cinema for 155 crore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Starrer Dunki Movie Ott Rights Reportedly Sold To Jio Cinema For 155 Crore

Dunki Movie OTT : 'డంకీ' ఓటీటీ హక్కులకు ఫుల్ డిమాండ్.. 155 కోట్లకు షారుక్ ఖాన్ సినిమా సేల్!

Anand Sai HT Telugu
Jul 09, 2023 10:43 AM IST

shah Rukh Khan Dunki : : 'డంకీ' సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు OTT ఒప్పందం ముగిసింది. దీంతో నిర్మాతలకు భారీ లాభం వచ్చింది.

డంకీ ఓటీటీ
డంకీ ఓటీటీ (Twitter)

షారుఖ్ ఖాన్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. పఠాన్ సినిమా తర్వాత.. మళ్లీ ఊపులోకి వచ్చాడు బాలీవుడ్ బాద్ షా. షారూఖ్‌తో సినిమా చేయాలని పెద్ద నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు. అయితే షారుఖ్ మాత్రం ఏ సినిమాను అంగీకరించేంత తొందరలో లేడు. ఆచితూచి వెళ్తున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన హిట్ పఠాన్. ఇక ఏ సినిమా పడితే ఆ సినిమా చేయెుద్దనే ఆలోచనల్లో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ(Dunki) సినిమాతో బిజీగా ఉన్నాడు షారుఖ్. ఈ సినిమా ఓటీటీ రైట్స్(OTT Rights) అమ్ముడయ్యాయనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, షూటింగ్ పూర్తికాకుండానే డంకీ మూవీ OTT హక్కులు అమ్ముడయ్యాయి. అది కూడా దాదాపు 155 కోట్ల రూపాయలని అంటున్నారు.

OTT సంస్థల మధ్య పోటీ పెరిగింది. కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించాలని జియో సినిమాస్(Jio Cinemas) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా OTT హక్కులను జియో సినిమాస్ తీసుకుందని టాక్ నడుస్తోంది. ఓటీటీ ప్రసార హక్కులను రూ.155 కోట్లకు కొనుగోలు చేశారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది.

దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar Hirani)కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. క్లాస్ సినిమాలు చేస్తూ ఎనలేని పేరు తెచ్చుకున్నాడు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు' చిత్రాలతో అభిమానులను అలరించాడు. రాజ్‌కుమార్ హిరానీ తొలిసారిగా షారుఖ్‌ఖాన్‌తో కలిసి డంకీ సినిమా చేయడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ 22న డంకీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు OTT ఒప్పందం ముగిసింది. దీంతో నిర్మాతలకు భారీ లాభం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా(Jawan Cinema) చేస్తున్నాడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద జవాన్ కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.