Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్‌-salman khan kisi ka bhai kisi ki jaan to stream on zee5 ott on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan To Stream On Zee5 Ott On This Date

Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్‌

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్

Kisi Ka Bhai Kisi Ki Jaan: స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే....

Kisi Ka Bhai Kisi Ki Jaan: స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. అన్నాత‌మ్ముళ్ల అనుబంధంతో యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 21న థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

క‌థ‌, క‌థ‌నాల‌పై నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్ మూవీ 180 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి లాభ‌సాటి ప్రాజెక్ట్‌గా నిలిచింది.

అంతే కాకుండా ఈ ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఈ నెల‌లోనే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. మే 26న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సంస్థ అర‌వై కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. టాలీవుడ్ అగ్ర హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాతోనే సుదీర్ఘ విరామం త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు వెంక‌టేష్‌. ఓ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ అతిథిగా న‌టించాడు.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకు స‌ల్మాన్‌ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌గా ఫ‌ర్హాద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళ చిత్రం వీర‌మ్ ఆధారంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా తెర‌కెక్కింది. వీర‌మ్ సినిమాను తెలుగులో కాట‌మ‌రాయుడు పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేశారు.

టాపిక్