Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గేమ్‌ఛేంజ‌ర్‌ సూప‌ర్ అప్‌డేట్ రివీల్ చేసిన‌ శంక‌ర్‌-game changer update ramcharan movie climax shoot wrapped up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Game Changer Update Ramcharan Movie Climax Shoot Wrapped Up

Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గేమ్‌ఛేంజ‌ర్‌ సూప‌ర్ అప్‌డేట్ రివీల్ చేసిన‌ శంక‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
May 10, 2023 07:49 AM IST

Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌ను డైరెక్ట‌ర్ శంక‌ర్ రివీల్ చేశాడు. ఆ అప్‌డేట్ ఏదంటే...

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Game Changer: గేమ్ ఛేంజ‌ర్ అప్‌డేట్స్ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు ద‌ర్శ‌కుడు శంక‌ర్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు తెలిపాడు. గ‌త ప‌దిహేను రోజులుగా హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో భారీ స్థాయిలో గేమ్‌ఛేంజ‌ర్ క్లైమాక్స్ సీన్‌ను చిత్రీక‌రిస్తోన్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.

దాదాపు 1200 మంది ఫైట‌ర్ల‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫైట్ మాస్ట‌ర్స్‌ అన్బుఅరివు సార‌థ్యంలో తెర‌కెక్కిస్తోన్న ఈ క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్ మంగ‌ళ‌వారం నాటితో పూర్త‌యిన‌ట్లు శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం శంక‌ర్ గ‌త సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ స్థాయిలో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా యాక్ష‌న్ సీన్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ క్లైమాక్స్‌ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం హై స్పీడ్ మోష‌న్ కంట్రోల్ రోబో కెమెరా ఉప‌యోగించిన‌ట్లు స‌మాచారం. ఈ మోకోబాట్ పేరుతో పిలిచే ఓ కెమెరాను గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమాలో యూజ్ చేశారు. కాగా ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లుతెలిసింది.

నెక్స్ట్ షెడ్యూల్ జూన్ ఫ‌స్ట్‌వీక్‌లో ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విన‌య‌విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. ఎస్‌జే సూర్య‌, సునీల్‌, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

IPL_Entry_Point