Jawan Prevue: నేను విల‌న్ అయితే నా ముందు ఏ హీరో నిల‌బ‌డ‌లేడు- షారుఖ్‌ఖాన్ జ‌వాన్ ప్రివ్యూ రిలీజ్‌-jawan prevue released shahrukh khan back with high intense action movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jawan Prevue Released Shahrukh Khan Back With High Intense Action Movie

Jawan Prevue: నేను విల‌న్ అయితే నా ముందు ఏ హీరో నిల‌బ‌డ‌లేడు- షారుఖ్‌ఖాన్ జ‌వాన్ ప్రివ్యూ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jul 10, 2023 11:52 AM IST

Jawan Prevue: షారుఖ్‌ఖాన్ జ‌వాన్ మూవీ పివ్యూ వీడియో వ‌చ్చేసింది. రెండు నిమిషాల 12 సెక‌న్ల నిడివితో కూడిన ఈ వీడియో స్ట‌న్నింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో హాలీవుడ్ స్థాయి విజువ‌ల్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

షారుఖ్‌ఖాన్ జ‌వాన్ మూవీ పివ్యూ
షారుఖ్‌ఖాన్ జ‌వాన్ మూవీ పివ్యూ

Jawan Prevue: ప‌ఠాన్ త‌ర్వాత మ‌రోసారి అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్ ల‌తో అభిమానుల‌కు గూస్‌బంప్స్ క‌లిగించేందుకు షారుఖ్‌ఖాన్ (Shahrukh Khan) రెడీ అవుతోన్నాడు. అత‌డు హీరోగా న‌టిస్తోన్న‌ జ‌వాన్ ప్రివ్యూ వీడియోను సోమ‌వారం రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రెండు నిమిషాల ప‌న్నెండు సెక‌న్ల‌తో కూడిన ఈ ప్రివ్యూ వీడియో స్ట‌న్నింగ్‌ యాక్ష‌న్ సీక్వెన్స్‌, విజువ‌ల్స్‌తో హాలీవుడ్ స్థాయిలో క‌నిపిస్తోంది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఈ ప్రివ్యూ వీడియో ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మైంది.

నేను మంచివాడినా? చెడ్డ‌వాడినా? పుణ్యాత్ముడినా? పాపాత్ముడినా? నువ్వే తెలుసుకో అని డైలాగ్ చూస్తుంటే షార్‌ఖ్ ఖాన్ సినిమాలో పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ముఖానికి ముసుగు ధ‌రించి ఈ వీడియో ప్రివ్యూలో షారుఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రివ్యూ చివ‌ర‌లో షారుఖ్‌ఖాన్ గుండుతో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశాడు. జ‌వాన్ ప్రివ్యూకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.

ఈ వీడియో ప్రివ్యూలో న‌య‌న‌తార‌ (Nayanthara) యాక్ష‌న్ ఓరియెంటెడ్ రోల్‌లో క‌నిపించింది. జ‌వాన్ సినిమాతోనే న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. త‌మిళ న‌టుడు విజ‌య్‌సేతుప‌తి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. అత‌డి క్యారెక్ట‌ర్‌ను వీడియో ప్రివ్యూలో చూపించ‌లేదు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకోణ్ జ‌వాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది. జ‌వాన్ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇదే తొలి బాలీవుడ్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం.

సెప్టెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జ‌వాన్ మూవీ రిలీజ్ కానుంది. స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై దాదాపు 220 కోట్ల బ‌డ్జెట్‌తో జ‌వాన్ సినిమాను స్వ‌యంగా షారుఖ్‌ఖాన్ నిర్మిస్తోన్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.