Dunki OTT: ఊహించని ఓటీటీలో షారుక్ ఖాన్ డంకీ మూవీ.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే!
Shahrukh Khan Dunki OTT Release: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ ఓటీటీ రిలీజ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాకుండా ఊహించని ఓటీటీలో డంకీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Rajkumar Hirani Dunki OTT Streaming: కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోసారి రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారని అంతా భావించారు. దాంతో డంకీ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.
మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కూడా ఒక రోజు గ్యాపుతో రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు డిసెంబర్ 21న అంటే గురువారం రోజున షారుక్ ఖాన్ డంకీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే షారుక్ పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని కోట్లల్లో వసూళ్లు సాధించాడు. ఇప్పుడు డంకీతో మరోసారి హైట్రిక్ కొట్టనున్నాడని తెలుస్తోంది.
అయితే, పఠాన్, జవాన్ తరహాలోనే హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డంకీని విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఆఖరి నిమిషంలో కేవలం హిందీలోనే డంకీని రిలీజ్ చేశారు. డంకీ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అంటూ నెటిజన్స్ ఎక్స్ (పాత ట్విటర్)లో పోస్ట్స్ షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డంకీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాలు ఆసక్తిగా మారాయి. డంకీ మూవీ జియో సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫామ్లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాకుండా ఊహించనివిధంగా జియో సినిమాలో డంకీ స్ట్రీమింగ్ కానుంది.
డంకీని జియో సినిమా రూ. 155 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్‌ను బట్టి, కలెక్షన్స్ దృష్ట్యా డంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.