Tiger 3 Twitter Review: టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ.. షారుక్ ఖాన్, హృతిక్ కెమియో అదుర్స్.. సల్మాన్, కత్రీనా ఎలా చేశారంటే?-salman khan tiger 3 movie twitter review and shahrukh khan hrithik roshan scene viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 Twitter Review: టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ.. షారుక్ ఖాన్, హృతిక్ కెమియో అదుర్స్.. సల్మాన్, కత్రీనా ఎలా చేశారంటే?

Tiger 3 Twitter Review: టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ.. షారుక్ ఖాన్, హృతిక్ కెమియో అదుర్స్.. సల్మాన్, కత్రీనా ఎలా చేశారంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 12, 2023 10:13 AM IST

Salman Khan Tiger 3 Twitter Review: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ మూడోసారి జంటగా నటించిన సినిమా టైగర్ 3. నవంబర్ 12 అంటే ఆదివారం విడుదల కానున్న ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ఇదివరకే పడిపోయాయి. ఈ క్రమంలో టైగర్ 3 ట్విటర్ రివ్యూ చూస్తే..

సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ
సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ

Twitter Review Of Tiger 3: ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ మరోసారి జోడీ కట్టిన సినిమా టైగర్ 3. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన టైగర్ 3కి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. సల్మాన్, కత్రీనా మూడోసారి రా ఏజెంట్స్ గా నటించారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన టైగర్ 3 మూవీ నవంబర్ 12న రిలీజ్ కానుండగా ప్రీమియర్ షోలు ఇదివరకే పడ్డాయి.

టైగర్ 3 మూవీ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. "టైగర్ 3 మూవీ అమెజింగ్‌గా ఉంది. నేను మాత్రం బాగా చిల్ అయ్యాను. గూస్ బంప్స్ తెప్పించింది. జోయా అత్యద్భుతంగా ఉంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. పఠాన్ కంటే చాలా బెటర్‌గా టైగర్ 3 ఉంది" అంటూ 5కి 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్.

"టైగర్ 3 మూవీ ఒక రోరింగ్ బ్లాక్ బస్టర్. జేమ్స్ బాండ్, బోర్న్ ఐడెంటిటీ వంటి సినిమాల తరహాలో ఎమోషన్స్, హైలెట్స్ తో పాటు యాక్షన్ ప్యాక్‌డ్‌ మూవీగా మనీష్ శర్మ తెరకెక్కించారు. స్పైలందరికీ బాబు అయిన సల్మాన్ ఖాన్‌కు గ్రాండ్ కమ్ బ్యాక్ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం అదిరిపోయింది. కత్రీనా కైఫ్ అదరగొట్టింది. స్పై యూనివర్స్ లో బెస్ట్ మూవీ" అంటూ 4.5 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.

"టైగర్ 3 సినిమా నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ చాలా నీరసంగా కనిపించాడు. అతని స్క్రీన్ ప్రజన్స్ కనిపించలేదు. ఏదో యానిమేటేడ్‌లా అనిపించింది. షారుక్ ఖాన్ ఎంట్రీ సినిమాను ఒక్కసారిగా లేపింది. కానీ, అతని కెమియో తర్వాత మళ్లీ సాగదీసినట్లుగా ఉంది. క్రతీనా కైఫ్ తన పాత్ర పరిధిమేర నటించింది. రూ. 250 కోట్ల వరకు టైగర్ 3 కలెక్షన్స్ రాబట్టగలదు" అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

"ఒక్క మాటలో చెప్పాలంటే టైగర్ 3 బ్లాక్ బస్టర్. ఈ మాస్ స్పై థ్రిల్లర్ సినిమాను మనీష్ శర్మ అందంగా తెరకెక్కించారు. కింగ్ సైజ్ ఎంటర్టైన్‌మెంట్. కచ్చితంగా చూడాల్సిన సినిమా" అంటూ 4.5 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్. "టైగర్ 3 రొటీన్ మూవీ. కానీ, టెర్రిఫిక్ మేకింగ్ దాన్ని నిలబెట్టింది. షారుక్, సల్మాన్ సీక్వెన్స్ టాప్ లెవెల్ ఫీలింగ్ ఇస్తాయి. కబీర్ (షారుక్ ఖాన్)తో ఇచ్చిన క్లైమాక్స్ బ్యాంగ్‌. కత్రీనా కైఫ్ పర్ఫామెన్స్ సూపర్బ్" అని మరోకరు చెప్పుకొచ్చారు.