Dunki Twitter Review: డంకీ ట్విటర్ రివ్యూ.. షారుక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, హిరానీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్-shahrukh khan dunki movie twitter review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dunki Twitter Review: డంకీ ట్విటర్ రివ్యూ.. షారుక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, హిరానీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్

Dunki Twitter Review: డంకీ ట్విటర్ రివ్యూ.. షారుక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, హిరానీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్

Sanjiv Kumar HT Telugu
Dec 21, 2023 07:55 AM IST

Shahrukh Khan Dunki Twitter Review: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా డంకీ. ఎట్టకేలకు ఈ మూవీ గురువారం అంటే డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డంకీ ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం.

డంకీ ట్విటర్ రివ్యూ.. షారుక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, హిరానీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్
డంకీ ట్విటర్ రివ్యూ.. షారుక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, హిరానీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్

Twitter Review Of Dunki: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ డంకీ. అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా ప్రభాస్ సలార్‌కు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 21న విడుదల కానుంది.

బ్యూటిఫుల్ తాప్సీ, విక్కీ కౌశల్ మరో ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారో డంకీ ట్విటర్ రివ్యూలో చూద్దాం. "ఓ మై గాడ్ ఫస్టాఫ్ ఫుల్ కామెడీ ఉంది. బాగా నవ్వు తెప్పించేలా ఉంది. సెకండాఫ్ ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో ఇంటర్వెల్ చెబుతుంది. ఇది హిరానీ మ్యాజిక్. షారుక్ ఖాన్ జస్ట్ వావ్" అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

"డంకీ వట్టి బ్లాక్ బస్టర్ కాదు. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ ఖాన్ క్యారెక్టర్ మీ మైండ్ తిరిగేలా చేస్తుంది. స్టోరీ టాప్ లెవెల్‌గా ఉంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సుమారు వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది" అని మరొకరు ట్వీట్ చేశారు.

"దేశవ్యాప్తంగా డంకీ సినిమాకు పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తున్నాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ కంటే మెరుగ్గా రాజ్ కుమార్ హిరానీ మరో మాస్టర్ పీస్ తెరకెక్కించాడు" అని ఒకతను ట్విటర్‌లో రాసుకొస్తూ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

"డంకీ ఒక ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్. రాజ్ కుమార్ హిరానీ సూపర్బ్ డైరెక్టర్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎమోషన్, ఫన్, ఎంటర్టైన్‌మెంట్ అన్ని కలగలిపిన ఒక ప్యాకేజీ ఇది. నా వరకు అయితే.. షారుక్ ఖాన్ కెరీర్‌లోనే డంకీ బెస్ట్ మూవీ. రాజు కుమార్ హిరాణీ బ్యూటి" అని ఒక నెటిజన్ చెబుతూ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

"రాజ్ కుమార్ హిరానీ మరోసారి నిరూపించాడు. స్క్రిప్ట్ ఎక్సలెంట్‌గా ఉంది. యాక్టింగ్ బ్రిలియింట్‌గా ఉంది. హిందీ సినీ చరిత్రలో డంకీ మంచి చిత్రంగా నిలిచిపోతుంది. డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రాజ్ కుమార్ హిరానీ కంటే బెటర్‌గా మరొకరు సినిమా తీస్తారని నేను అనుకోవట్లేదు" అని ఒక యూజర్ చెప్పుకొచ్చాడు.

Whats_app_banner