Shah Rukh on Deepika: బేషరమ్ రంగ్‌లాంటి పాట దీపికా మాత్రమే చేయగలదు: షారుక్ ఖాన్-shah rukh on deepika says the actress like her stature only can do that besharam rang song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh On Deepika Says The Actress Like Her Stature Only Can Do That Besharam Rang Song

Shah Rukh on Deepika: బేషరమ్ రంగ్‌లాంటి పాట దీపికా మాత్రమే చేయగలదు: షారుక్ ఖాన్

Hari Prasad S HT Telugu
Jan 18, 2023 06:39 PM IST

Shah Rukh on Deepika: బేషరమ్ రంగ్‌లాంటి పాట దీపికాలాంటి నటి మాత్రమే చేయగలదని అన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. పఠాన్ మూవీలో ఆమె పోషించిన పాత్రపై కింగ్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు.

బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకోన్, షారుక్ ఖాన్
బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకోన్, షారుక్ ఖాన్

Shah Rukh on Deepika: పఠాన్ మూవీలోని బేషరమ్ రంగ్ పాట ఎంత దుమారం రేపిందో తెలుసు కదా. ఆ పాటలో దీపికా పదుకోన్ వేసుకున్న కాషాయ రంగు బికినీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సాంగ్ మొత్తం దీపికా బికినీల్లోనే కనిపించడంతోపాటు ఆమె వేసిన వింత స్టెప్పులపై కూడా ట్రోలింగ్ జరిగింది. అయితే ఇలాంటి పాటను దీపికాలాంటి పేరున్న నటి మాత్రమే చేయగలదని ఈ మూవీ హీరో షారుక్ అంటున్నాడు.

పఠాన్ మూవీ జనవరి 25న రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ మూవీని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో షారుక్ సినిమా గురించి వివిధ అంశాలపై స్పందించాడు. అందులో భాగంగా దీపికా పదుకోన్ గురించి కూడా ఓ ప్రశ్న ఉంది. యాక్షన్ ఫిల్మ్ హీరోయిన్ కు తగిన లక్షణాలు అన్నీ దీపికలో ఉన్నాయని కింగ్ ఖాన్ అన్నాడు.

"బేషరమ్ రంగ్ లాంటి పాట అయినా, పఠాన్ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అయినా దీపికాలాంటి పేరున్న నటితోనే సాధ్యం. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ లో దీపికా చేసిన స్టంట్స్ ఆమె మాత్రమే చేయగలదు. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయగలిగే సత్తా ఆమెలో ఉంది. అలాంటి పాట, అలాంటి ఫైట్లు దీపికాలాంటి నటితో మాత్రమే చేయగలం. యాక్షన్ ఫిల్మ్ హీరోయిన్ కు సరిగ్గా సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ ఇది" అని షారుక్ అన్నాడు.

"నేను 32 ఏళ్ల కిందట సినిమా ఇండస్ట్రీలోకి ఓ యాక్షన్ హీరోగా వచ్చాను. కానీ తర్వాత నన్ను అందరూ కలిసి రొమాంటిక్ హీరోని చేశారు. నేను కేవలం యాక్షన్ హీరోగా మాత్రమే ఉందామని అనుకున్నాను. అంటే నాకు డీడీఎల్జే అంటే ఇష్టమే. రాహుల్, రాజ్ వంటి క్యారెక్టర్లూ ఇష్టమే. కానీ నేనెప్పుడూ యాక్షన్ హీరోనే కావాలని అనుకున్నాను. పఠాన్ మూవీతో ఆ కల నెరవేరింది" అని షారుక్ చెప్పాడు.

పఠాన్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంతో థ్రిల్లింగా ఉంది. ఇందులో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడు. నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ ఇది. మధ్యలో గతేడాది బ్రహ్మస్త్ర మూవీలో గెస్ట్ రోల్ లో మాత్రం అతను కనిపించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం