Skanda Second Song: ‘స్కంద’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ ఇరగదీసిన రామ్, శ్రీలీల: చూసేయండి-second single song from skanda released ram pothineni sree leela mesmerised with dance moves ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Second Song: ‘స్కంద’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ ఇరగదీసిన రామ్, శ్రీలీల: చూసేయండి

Skanda Second Song: ‘స్కంద’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ ఇరగదీసిన రామ్, శ్రీలీల: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 18, 2023 06:21 PM IST

Skanda Second Song: స్కంద సినిమా నుంచి రెండో పాట రిలీజ్ అయింది. ‘గండరబాయ్’ అంటూ మాస్ దరువుతో ఈ పాట హుషారుగా ఉంది.

Skanda Second Song: ‘స్కంద’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ ఇరగదీసిన రామ్, శ్రీలీల
Skanda Second Song: ‘స్కంద’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ ఇరగదీసిన రామ్, శ్రీలీల

Skanda Second Song: యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్‍ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి నేడు (ఆగస్టు 18) ‘గండరబాయ్’ అనే పాట రిలీజ్ అయింది. గురువారం ప్రోమో రాగా.. నేడు పూర్తి లిరికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాట ఎలా ఉందంటే..

స్కంద నుంచి వచ్చిన ఈ రెండో పాటకు థమన్ పూర్తి మాస్‍బీట్‍ను అందించాడు. ఫోక్ సాంగ్‍లా మంచి ఊపుతో ఈ పాట ఉంది. ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్ ఈ సాంగ్‍కు రిలిక్స్ రాశారు. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట మొత్తం ఫాస్ట్ బీట్‍తో డ్యాన్స్ నంబర్‌గా ఉంది. “గంటకొట్టి సెప్పుకో.. గంటకొట్టి సెప్పుకో.. గంటలోనే వస్తానే గండర.. గండరబాయ్” అంటూ ఈ పాట షురూ అయింది.

ఈ పాటకు హీరో రామ్‍ పోతినేని, హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ ఇరగదీశారు. లిరికల్ సాంగ్ అయినా.. కొన్ని డ్సాన్స్ మూవ్‍మెంట్లను ఈ వీడియోలో ఉంచింది చిత్ర యూనిట్. రామ్, శ్రీలీల డ్యాన్స్ మూవ్‍మెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటకు తగ్గట్టు ఫుల్ ఎనర్జీతో వారిద్దరూ డ్యాన్స్ వేశారు. స్కంద చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ పాట కూడా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది.

స్కంద చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌ కింద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే అది అర్థమైంది. స్కంద కూడా బోయపాటి మార్క్ చిత్రంగానే ఉండనుంది.