SAREGAMAPA 16 Grand Launch: సరిగమప 16 గ్రాండ్ లాంచ్.. మెంటర్స్గా ముగ్గురు స్టార్ సింగర్స్.. ఆరోజు నుంచే ప్రారంభం!
SAREGAMAPA 16 The Next Singing Youth Icon Grand Launch: సీరియల్స్, టీవీ షోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేసే జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కాబోయే గాయనీగాయకులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది.
Zee Telugu SAREGAMAPA 16 Grand Launch: జీ తెలుగు ఆవిర్భావం నుంచి విలక్షణమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. వినోదాల పరంపరను కొనసాగిస్తూ జీ తెలుగు పాపులర్ షో సరిగమప సరికొత్త సీజన్‌తో వచ్చేస్తోంది.
గ్రాండ్ లాంచ్
మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో విజయవంతంగా 15 సీజన్లు పూర్తిచేసుకున్న జీ తెలుగు సరిగమప తన తదుపరి సీజన్‌ను ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ షోను సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానెల్లో ప్రాసారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గాయకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ షో ఇంకా కొనసాగుతోంది. ఈ సీజన్సో గాయనీ గాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే మూడు జట్లుగా పోటీపడతారు.
మూడు టీమ్స్
ఈ జట్లకు మెంటర్లుగా సింగర్, బిగ్ బాస్ తెలుగు 6 టైటిల్ విన్నర్ రేవంత్, రమ్య బెహరా, అనుదీప్ దేవ్ నాయకత్వం వహిస్తారు. ఈ సీజన్‌కు ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో సరిగమప సీజన్ 16 ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్లో మూడు జట్లను సపోర్ట్ చేసేందుకు ముగ్గురు ప్రముఖ సింగర్స్ హాజరు కానున్నారు. విలేజ్ వోకల్స్‌ను పెంచల్ దాస్, సిటీ క్లాసిక్స్‌ను చిన్మయి సపోర్ట్ చేస్తుండగా మెట్రో మెలోడీస్‌ను కేదన్ శర్మ సపోర్ట్ చేయనున్నారు.
సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కి ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్ ముఖ్యఅతిథిగా హాజరు కానుండగా.. హైదరాబాదీ పాపులర్ రాపర్ కేదన్ శర్మ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అందరినీ ఉర్రూతలూగించనున్నారు. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్స్ రకరకాల జోనర్స్ పాటలతో పోటీపడనున్నారు.
ఇదే మా లక్ష్యం
జీ తెలుగు సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కొత్త సీజన్ హోస్ట్, జడ్జ్‌లు, మెంటర్లు, కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జీలు ఈ సీజన్ ప్రత్యేకతల గురించి మీడియాతో మాట్లాడుతూ సంగీతంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. "యువ, అసాధారణ ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ లాంచ్ ప్యాడ్‌గా ఉన్న జీ తెలుగు సరిగమప సీజన్ 16 ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో సింగింగ్ యూత్ ఐకాన్ కోసం పోటీ జరుగుతుంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ ప్రతిభావంతులైన గాయనీగాయకులను ప్రోత్సహించడమే మా లక్ష్యం" అని తెలిపారు.
"ఇప్పటికే మనం చూసిన ఎనర్జీ, ప్యాషన్, టాలెంట్ చెప్పుకోదగ్గవి. తమ కలలను నిజం చేసుకోవడమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఓ వేదికను అందించడమే మా ఉద్దేశం. ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం" అని అనురాధ ధీమా వ్యక్తం చేశారు.