Kasthuri Shankar : అమ్మాయిల పర్సనల్ వీడియో షేర్ చేసిన కస్తూరి.. నీకెందుకు అంటూ చిన్మయి ఫైర్-actress kasthuri shankar shares video of girls buying liquor goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kasthuri Shankar : అమ్మాయిల పర్సనల్ వీడియో షేర్ చేసిన కస్తూరి.. నీకెందుకు అంటూ చిన్మయి ఫైర్

Kasthuri Shankar : అమ్మాయిల పర్సనల్ వీడియో షేర్ చేసిన కస్తూరి.. నీకెందుకు అంటూ చిన్మయి ఫైర్

Anand Sai HT Telugu

Kasthuri Shankar Viral Video : ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొంటున్న వీడియోను నటి కస్తూరి ట్విట్టర్‌లో షేర్ చేసింది. బాగా తాగండి అమ్మాయిలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు కస్తూరిపై సింగర్ చిన్మయి, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

చిన్మయి వర్సెస్ కస్తూరి

నటి కస్తూరి శంకర్(Kasthuri Shankar) ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. కన్నడ, తెలుగు వంటి భాషల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆదిపురుష్ సినిమా మీద కూడా కామెంట్స్ చేసి విమర్శలపాలైంది. ప్రభాస్ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. తాజాగా ఇద్దరు అమ్మాయిల గురించి ఓ వీడియో షేర్ చేసింది కస్తూరి. దీంతో చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు.

కస్తూరి ఇప్పుడు చాలా సీరియల్స్‌లో నటిస్తోంది. రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. సినిమాలు, సీరియల్స్‌తో పాటు వార్తల్లో నిలుస్తోంది. కస్తూరి శంకర్ 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడలో నటించింది. నాగర్జున అన్నమయ్య, మోహన్ బాబు సోగ్గాడి పెళ్లాం, రాజశేఖర్ మా ఆయన బంగారం.. ఇలా పలు సినిమాల్లో నటించి.. మంచి పేరు తెచ్చుకుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ చేస్తోంది. అప్పుడప్పుడు కొన్ని విషయాలపై స్పందించి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన పర్సనల్ వీడియో షేర్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొంటున్న వీడియోను కస్తూరి ట్విట్టర్‌లో షేర్ చేసింది. 'బాగా తాగండి అమ్మాయిలు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది వాట్సాప్ ఫార్వర్డ్‌లోని వీడియో అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. పలువురు నటిపై విమర్శలు గుప్పించారు. ఇది యువతుల వ్యక్తిగత విషయం అని, దీన్ని ఎందుకు షేర్ చేశారని ప్రశ్నించారు.

దీనిపై గాయని చిన్మయి(Singer Chinmayi) స్పందిస్తూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు' అంటూ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లు కూడా చిన్మయికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ పోస్ట్ చాలా మందిని తప్పుదారి పట్టించేలా ఉంది' అని చాలా మంది అంటున్నారు. అసలు అమ్మాయిలు మందు తాగడాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు మందు తాగొద్దని, ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు. అదే సెలబ్రెటీల ఇళ్లలో మందు తాగితే.. షేర్ చేసే దమ్ము ఉందా కస్తూరి అంటున్నారు నెటిజన్లు.