Samantha in Bikini: బికినీలో సమంత.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు.. నీటిలో జలకాలాడుతూ..
Samantha in Bikini: సమంత రుత్ ప్రభు బికినీలో ఉన్న ఫొటో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 23) ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ బికినీ ఫొటోలు వైరల్ అయ్యాయి.
Samantha in Bikini: టాలీవుడ్ బ్యూటీ సమంత బికినీలో రెచ్చిపోయింది. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆమె అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో జలకాలాడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 23) సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. హయ్యెస్ట్ లవ్ అనే క్యాప్షన్ తో సామ్ పోస్ట్ ఈ బికినీ ఫొటోలను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
బికినీలో సమంత
కొన్నాళ్లుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆమె ఆధ్యాత్మిక యాత్రలతోపాటు జీవితాన్ని ఉల్లాసంగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మలేషియా కూడా వెళ్లింది. అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఓ నీటి కొలనులో తాను బికినీలో ఉన్న ఫొటోలను సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి. అందులో సామ్ అందం చూసి ఫిదా అవుతున్నారు. ఆమె అక్కడి ప్రకృతిని చూస్తూ పరవశిస్తుండగా.. బికినీలో ఉన్న సామ్ ను చూసి ఫ్యాన్స్ పులకించిపోతున్నారు. కామెంట్స్ సెక్షన్ ను నింపేస్తున్నారు. హాట్, ఉఫ్ అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సమంతను ఇలా చూసే సరికి ఫ్యాన్స్ దిమ్మ దిరిగిపోయింది.
ఈ ఫొటోలు షేర్ చేసిన గంటలోనే 15 లక్షల లైక్స్ రావడం విశేషం. ఆ లెక్కన ఈ బికినీ ఫొటోలు ఎంతలా వైరల్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మయోసైటిస్ నుంచి కోలుకుంటూ ఈ మధ్యే ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. తాను నటిస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్ కోసం వరుణ్ ధావన్ తో కలిసి డబ్బింగ్ చెప్పింది. ఈ సిరీస్ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. దీని తర్వాత మరో సినిమాకు ఇప్పటి వరకూ ఆమె సంతకం చేయలేదు.
సమంత.. అందాల ఆరబోత..
మలేషియా టూర్లో కొన్ని రోజులుగా సమంత అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ఈ మధ్యే ఓ రెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ లో క్లీవేజ్ షో చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవి కూడా వైరల్ అయ్యాయి.
ఇక సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్.. ఈ మధ్యే పాడ్‌కాస్ట్ షో ప్రారంభించింది. టేక్ 20 పేరుతో సమంత తీసుకొచ్చిన హెల్త్ పాడ్‌కాస్ట్ ఇది. దీని ద్వారా అభిమానులకు ఆమె హెల్త్ పాఠాలు చెబుతోంది. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుండటంతో అది ఎలా వస్తుంది? దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ఓ పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది.
ఆటో ఇమ్యూనిటీని అర్థం చేసుకోవడం అనే అంశంతో టేక్ 20 పాడ్‍కాస్ట్ తొలి ఎపిసోడ్‍ను సమంత తీసుకొచ్చింది. ఇందులో ఆరోగ్య నిపుణుడు అల్కేశ్‍ను ఈ అంశంపై సమంత ప్రశ్నలు అడిగింది. ఆటో ఇమ్యూన్ ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలనే అంశాలతో పాటు తన విషయాలను కూడా సమంత చెప్పారు. తన యూట్యూబ్ ఛానెల్‍లో ఈ ఎపిసోడ్‍ను అప్‍లోడ్ చేశారు.
టాపిక్