Sai Pallavi: చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్-sai pallavi dances to marathi songs at sister pooja kannan wedding videos gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

Sai Pallavi: చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Sep 11, 2024 03:32 PM IST

Sai Pallavi: సాయిపల్లవి తన చెల్లి పెళ్లిలో హంగామా చేసింది. మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. పెళ్లి వేడుకలో మరాఠీ పాటలపై రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హంగామా.. మరాఠీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

Sai Pallavi: సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఈ మధ్యే వినీత్ శివకుమార్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. తమిళనాడులో వీళ్ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లిలో సాయి పల్లవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి నుంచీ ప్రతి ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆమె.. పెళ్లి సందర్భంగా కూడా మరాఠీ పాటలకు మాంచి స్టెప్పులేసింది.

సాయి పల్లవి డ్యాన్స్

సాయి పల్లవి చెల్లెలు, నటి అయిన పూజా కన్నన్ పెళ్లి గత వారం జరిగింది. అయితే ఆ పెళ్లిలో పల్లవి చేసిన డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగీత్ లో ఆమె రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఓ ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో సాయి పల్లవి బ్లూ కుర్తాలో కనిపించింది. మరాఠీ సాంగ్ అప్సర ఆలీ పాటకు మొదట డ్యాన్స్ చేసింది.

ఆ తర్వాత మరో హిట్ మరాఠీ మూవీ సైరాట్ లోని జింగాత్ పాటకు కూడా ఆమె స్టెప్పులేసిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ పాటకు తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆమె డ్యాన్స్ చేసింది. పాట బీట్ కు తగినట్లుగా సాయి పల్లవి వేసిన స్టెప్పులు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఆ తర్వాత పెళ్లిలో ఆమె పూర్తి తెల్ల చీరలో సాంప్రదాయబద్ధంగా కనిపించింది. గతంలో జనవరిలో జరిగిన పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ సెర్మనీలోనూ సాయి పల్లవి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

సాయి పల్లవి సినిమాలు

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. శత్రు దేశంలో అక్రమంగా బందీ అయిన తన ప్రియుడి కోసం పోరాటం చేసే అమ్మాయి పాత్రలో ఈ మూవీలో ఆమె కనిపించనుంది.

ఇక ఇదే కాకుండా తమిళ సినిమా అమరన్ లోనూ ఆమె నటిస్తోంది. శివ కార్తికేయన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇక బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణ్ లోనూ ఆమె సీత పాత్రలో నటిస్తోంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో మరో మూవీ చేస్తోంది. దీనికోసం ఈ మధ్యే జపాన్ వెళ్లింది.