Krishna Gadu Ante Oka Range: కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ - సైరాట్ లాంటి ప్రేమ‌క‌థ‌-krishna gadu ante oka range movie trailer unveiled by dil raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Gadu Ante Oka Range: కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ - సైరాట్ లాంటి ప్రేమ‌క‌థ‌

Krishna Gadu Ante Oka Range: కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ - సైరాట్ లాంటి ప్రేమ‌క‌థ‌

HT Telugu Desk HT Telugu
Jul 26, 2023 05:03 PM IST

Krishna Gadu Ante Oka Range: రిష్వి తిమ్మ‌రాజు, విస్మ‌య‌శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ మూవీ ట్రైల‌ర్‌ను బుధ‌వారం దిల్‌రాజు రిలీజ్ చేశాడు. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు రాజేష్ దొండ‌పాటి ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు.

కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ మూవీ
కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ మూవీ

Krishna Gadu Ante Oka Range: క‌థ‌, కాన్సెప్ట్ బాగుంటే కొత్త‌, పాత న‌టులు అనే భేదాలు లేకుండా మంచి సినిమాల్ని ఎప్పుడూ తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటారు.ఆ సిద్ధాంతాన్ని న‌మ్మే కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ మూవీని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు రాజేష్ దొండ‌పాటి. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ఆగ‌స్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు బుధ‌వారం రిలీజ్ చేశారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ జంట ప్రేమ‌క‌థ‌తో స‌హ‌జంగా ట్రైల‌ర్ సాగింది. కృష్ణ అనే యువ‌కుడి జీవితం నేప‌థ్యంలో ఈ సినిమాసాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఉన్న‌త వ‌ర్గానికి చెందిన అమ్మాయితో అత‌డు ప్రేమ‌లో ప‌డ‌టం, వారి ప్రేమ‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌తో ట్రైల‌ర్ ఇంటెన్స్‌గా ఉంది.

ల‌వ్ స్టోరీ, స‌స్పెన్స్ మిస్ట‌రీ తో పాటు యూత్‌ను మెప్పించే అన్ని అంశాల‌తో డైరెక్ట‌ర్‌ రాజేష్ దొండ‌పాటి ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. మ‌రాఠీ మూవీ సైరాట్ త‌ర‌హాలో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ సినిమాలో రిష్వి తిమ్మ‌రాజు, విస్మ‌య‌శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా రాజేష్ దొండ‌పాటి, హీరోహీరోయిన్లు రిష్వి, విస్మ‌య‌శ్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు మూడు సాంగ్స్‌తో పాటు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ర‌ఘు, స్వాతి పొలిచెర్ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీకి వ‌రికుప్ప‌ల యాద‌గిరి సాహిత్యాన్ని స‌మ‌కూర్చుతుండ‌గా సాబు వ‌ర్గీస్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024