Virupaksha OTT Release Date: విరూపాక్ష ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎన్ని కోట్లకు డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయంటే-sai dharam tej virupaksha movie to stream on netflix from may 21 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Ott Release Date: విరూపాక్ష ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎన్ని కోట్లకు డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయంటే

Virupaksha OTT Release Date: విరూపాక్ష ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎన్ని కోట్లకు డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయంటే

Nelki Naresh Kumar HT Telugu
May 08, 2023 12:01 PM IST

Virupaksha OTT Release Date: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ విరూపాక్ష ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష
సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష

Virupaksha OTT Release Date: సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విరూపాక్ష సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లోనూ అదే రోజు రిలీజ్ అవుతోన్న‌ట్లు తెలిసింది.

ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను దాదాపు ప‌ది కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ తెలుగులో 90 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా విరూపాక్ష నిలిచింది. త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మే 5 రిలీజైన ఈ మూవీ డిసెంట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. రుద్ర‌వ‌నం అనే ఊరిలో జ‌రుగుతోన్న మ‌ర‌ణాల వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే సూర్య అనే యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌, సంయుక్త న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో సంయుక్త త‌న న‌ట‌న‌తో తెలుగు ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే విరూపాక్ష సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించ‌డంతో పాటు భోగ‌వ‌ల్లి బాపినీడుతో క‌లిసి సుకుమార్ విరూపాక్ష సినిమాను నిర్మించారు. విరూపాక్ష‌కు సీక్వెల్‌గా విరూపాక్ష -2 కూడా రాబోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కాగా ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.

టాపిక్