Virupaksha Enters 100 cr Club: వంద కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - చిరంజీవి త‌ర్వాత మెగా మేన‌ల్లుడిదే ఈ రికార్డ్‌-sai dharam tej virupaksha movie enters 100cr club ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Enters 100 Cr Club: వంద కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - చిరంజీవి త‌ర్వాత మెగా మేన‌ల్లుడిదే ఈ రికార్డ్‌

Virupaksha Enters 100 cr Club: వంద కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - చిరంజీవి త‌ర్వాత మెగా మేన‌ల్లుడిదే ఈ రికార్డ్‌

HT Telugu Desk HT Telugu
May 18, 2023 12:18 PM IST

Virupaksha Enters 100 cr Club: సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష మూవీ వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంది. ఈ ఏడాది ఈ ఘ‌న‌త‌ను సాధించిన నాలుగో తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష
సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష

Virupaksha Enters 100 cr Club: సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష మూవీ వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లో ఈ ఘ‌న‌త‌ను సాధించిన మొద‌టి సినిమాగా విరూపాక్ష నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. విరూపాక్ష కంటే ముందు 2023లో వాల్తేర్ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి, ద‌స‌రా మాత్ర‌మే ఈ మైలురాయిని అందుకున్నాయి.వాల్తేర్ వీర‌య్య త‌ర్వాత ఈ ఏడాది వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైన‌ మెగా హీరోగా సాయిధ‌ర‌మ్‌తేజ్ నిలిచాడు.

విరూపాక్ష సినిమాకు కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో గ‌త నెల‌లో రిలీజైన ఈ మూవీ త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో మే నెల‌లో రిలీజ్ చేశారు. తెలుగు మ్యాజిక్‌ను ఇత‌ర భాష‌ల్లో కొన‌సాగించ‌లేక‌పోయింది. విరూపాక్ష నెట్‌ఫ్లిక్స్ ద్వారా మే 21న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు విరూపాక్ష సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చాడు. రుద్ర‌వ‌నం అనే ఊరిలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని ఛేదించే ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో త‌న త‌ల్లిదండ్రుల‌ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి త‌పించే యువ‌తిగా సంయుక్త న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా రెండేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైన సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, సునీల్‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌తో క‌లిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు.

Whats_app_banner