Naatu Naatu Live Performance: ఆస్కార్స్ వేదికపై అదిరే పర్ఫార్మెన్స్.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన కన్ఫార్మ్
Naatu Naatu Live Performance: ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న నిర్వహించనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవంలో నాటు నాటు లైవ్ ప్రదర్శన జరుగుతుదని తెలుస్తోంది.
Naatu Naatu Live Performance: ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో తెలిసిందే. ఈ సినిమాపై వెస్టర్న్ ఆడియెన్స్ సైతం విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ కూడా సొంతం చేసుకుంది. అంతేకాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ కూడా అందుకుంది. అకాడమీ అందుకోడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న సందర్భంగా ఈ సినిమాను ఇప్పటికే మార్చి 3న రిరీలిజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ నుంచి ఆదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుందట.
అయితే ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ చేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పాట ఒరిజినల్‌గా పాడిన రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ 95వ అకాడమీ అవార్డుల వేడుకల్లో లైవ్ ప్రదర్శన ఇస్తారని అధికారిక వార్త వచ్చింది. మార్చి 12 ఆదివారం నాడు ఈ వేడుక జరగనుంది. అకాడమీ అవార్డ్స్ నుంచి అధికారికంగా ఈ వార్త ఖరారైంది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా నాటు నాటు పాటకు కూడా విపరీతంగా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అందుకుంది. ఇది కాకుండా హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఐదు విభాగాల్లో దక్కించుకుంది.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేటైంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
సంబంధిత కథనం