Razakar Movie Review: రజాకార్ మూవీ రివ్యూ - వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఎలా ఉందంటే?
Razakar Movie Review: బాబీసింహా, అనసూయ, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యథార్ఘ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.
Razakar Movie Review ఇండియాలో విలీనానికి ముందు హైదరాబాద్ సంస్థానంలో ఏం జరిగింది?రజాకార్ల అకృత్యాలు ఎలా సాగాయనే కథాంశంతో తెరకెక్కిన రజాకార్ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. రజాకార్ మూవీకి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. బాబీసింహ, అనసూయ, ఇంద్రజ, వేదిక కీలక పాత్రలు పోషించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?
ఖాసీం రజ్వీ దురాగతాలు...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియాలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించడు. రజాకార్ల సాయంతో ఇండిపెండెంట్‌గానే హైదరాబాద్‌ను పాలించాలని నిజాం నవాబ్ నిర్ణయించుకుంటాడు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకర్లు హిందువులును ముస్లింలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతారు.
నిజాం ప్రధాని లాయక్ అలీ కూడా ఖాసీం రజ్వీ సపోర్ట్ చేస్తాడు. ఉర్దూ తప్ప మిగిలిన భాషలు మాట్లాడకూడదని కట్టడి విధిస్తారు. తమకు ఎదురుతిరిగిన ప్రజలను రజాకర్లు దారుణంగా అంతమొందిస్తారు. సిస్తుల పేరుతో ప్రజలకు దోచుకోవడం మొదలుపెడతారు. రజాకర్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, రాజిరెడ్డి, శాంతవ్వ తో పాటు చాలా మంది నాయకులు ఎలాంటి పోరాటం సాగించారు? రజాకర్ల కుట్రలను సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా తిప్పికొట్టాడు.
నెహ్రూ అంగీకరింకపోయినా వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో ఏ విధంగా విలీనం చేశాడు? నిజాం నవాబ్ విలీనానికి అంగీకరించాడా? మతకల్లోలాలు సృష్టించాలని అనుకున్న ఖాసీం రజ్వీ కుట్రలను పటేల్ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే రజాకర్ మూవీ కథ.
యథార్థ ఘటనలతో...
నిజాం పాలనలో రజాకార్లు ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ మూవీని తెరకెక్కించాడు. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాడు. తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన చాలా మంది యోధుల జీవితాలతో ఎమోషనల్‌గా ఈ మూవీ సాగుతుంది. ఓ వైపు ప్రజా పోరాటం, మరోవైపు రజాకర్ల దురాగతాలు వీటికి సమాంతరంగా హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాల చుట్టూ కథను అల్లుకున్నారు. .
బైరాన్‌పల్లి, గుండ్రాన్‌పల్లి , పరకాల జెండా ఉద్యమం, ఈశ్వరయ్య, గండయ్య గ్యాంగ్ సాహసంతో తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రజాకార్లను ఎదురించి ప్రజలు సాగించిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించాడు. వారి పోరాటాన్ని అణిచివేసేందుకు రజాకర్లు చేసిన హింస, రక్తపాతం మనసుల్ని కదిలిస్తాయి. తెలుగు మాట్లాడిన పిల్లలను రజాకార్లు క్రూరంగా హిసించడం, బతుకమ్మ ఆడిన మహిళల్ని వివస్త్రలు చేయడం, మానభంగాలు, మారణ హోమం సినిమాలో వాస్తవిక కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్.
ప్రతి ఒక్కరూ హీరోలే...
రజాకార్ సినిమాలో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరూ లేరు. ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ పాత్రను తెరపైకి తీసుకొస్తూ ఆసక్తికరంగా కథను ముందుకు నడిపించారు డైరెక్టర్. తెలంగాణ సాయుధ పోరాటంలో బాగా ప్రాచుర్యం పొందిన వారి జీవితాల్ని, చరిత్రలో నిలిచిపోయిన కొన్ని సంఘనటనలను సినిమాలో చూపించారు.
చరిత్రను వక్రీకరించకుండా యథార్ఠంగా ఏం జరిగిందో అదే చెప్పేందుకు తపన పడ్డారు. రజాకర్ సినిమాలో చూపించినవన్నీ చాలా వరకు తెలిసిన కథలే. అయినా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్, డ్రామా బలంగా పండేలా సీన్స్ రాసుకున్నాడు. షోయాబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ, రాజారెడ్డి తో పాటు చాలా మంది నాయకుల పోరాటపఠిమను స్ఫూర్తిదాయకంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.
మితి మీరిన హింస...
ఖాసీం రజ్వీతో పాటు రజాకార్లను విలన్స్‌గా చూపించే ప్రయత్నంలో కొన్ని చోట్ల హింస మీతిమీరినట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ సాయిధ పోరాటాన్ని పూర్తిగా కాకుండా అసంపూర్తిగా కేవలం కొన్ని యాంగిల్స్ మాత్రమే సినిమాలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఫుల్ సినిమాగా కాకుండా ఎపిసోడ్స్‌గా సాగడంతో కొన్ని చోట్ల కనెక్టివిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల చరిత్రను వక్రీకరించారు.
రాజ్ అర్జున్ హైలైట్...
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ యాక్టింగ్‌తో మెప్పించారు. రాజన్నగా బాబీసింహ, పోచమ్మగా అనసూయ, శాంతవ్వగా వేదిక, ఐలమ్మ పాత్రకు ఇంద్రజ ప్రాణం పోశారు. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా ఖాసీం రజ్వీగా రాజ్ అర్జున్ హైలైట్‌గా నిలిచాడు. విలన్ క్యారెక్టర్‌లో అతడి నటన, ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజ్ సప్రు మెప్పించాడు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్‌తో పాటు చాలా మంది ఆర్టిస్టులు సినిమాలో కనిపిస్తారు.
బీజీఎమ్ బాగుంది...
టెక్నికల్‌గా భీమ్స్ పాటలు, బీజీఎమ్ దర్శకుడి రాసుకున్న కథలోని ఫీల్‌ను బలంగా ఎలివేట్ చేయడానికి దోహదపడ్డాయి. 1947, 48ల నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లుగా విజువల్స్, గ్రాఫిక్స్ ద్వారా సినిమాలో సహజంగా చూపించారు.
చరిత్రలో నిలిచిపోయిన పోరాట యోధులు…
తెలంగాణ విముక్తి పోరాటం చరిత్రలో నిలిచిపోయిన మంది పోరాట యోధులు, సంఘటనలకు చక్కటి దృశ్యరూపంగా రజాకార్ మూవీ నిలుస్తుంది. చరిత్ర తెలిసిన వారికే ఎక్కువగా ఈ మూవీ కనెక్ట్ అవుతుంది.
టాపిక్