Prema Vimanam Review: ప్రేమ విమానం రివ్యూ - అనసూయ, సంగీత్ శోభన్ మూవీ ఎలా ఉందంటే?
Prema Vimanam Review: అనసూయ, సంగీత్‌శోభన్, శాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమ విమానం మూవీ జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు.
Prema Vimanam Review: అనసూయ(Anasuya), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), శాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమ విమానం మూవీ జీ5 ఓటీటీలో (Zee5 OTT) రిలీజైంది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాలో అతడి తనయులు దేవాన్ష్, అనిరుధ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే...
విమాన ప్రయాణం....
రాము (దేవాన్ష్ నామా), లక్ష్మణ్(అనిరుధ్ నామా) అన్నదమ్ములు. ఓ స్నేహితుడి ద్వారా విమానం ఎక్కాలనే కోరిక వారిలో బలంగా మొదలవుతుంది. అప్పుల బాధతో రాము, లక్ష్మణ్ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ అప్పుభారం శాంతమ్మపై (అనసూయ) పడుతుంది.
తాను ఇచ్చిన అప్పును ఆరు నెలల్లో తీర్చాలని షావుకారు ఆమెను బెదిరిస్తాడు. విమానం ఎక్కాలనే మోజుతో అప్పు తీర్చడం కోసం తల్లి కష్టపడి కూడబెట్టిన డబ్బును తీసుకొని రాము, లక్ష్మణ్ హైదరాబాద్ పారిపోతారు.
మల్లయ్య (గోపరాజు రమణ) ఊళ్లో కిరాణాషాప్ నడుపుతుంటాడు. తన కొడుకు మణిని (సంగీత్‌శోభన్) దుబాయ్ పంపించాలన్నది అతడి కోరిక. మణి మాత్రం ఊరు విడిచివెళ్లనని మొండిపట్టుపడతాడు. ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ మేఘన) అందుకు కారణం.
చిన్నప్పటి నుంచి మణి, అభిత ఒకరినొకరు ఇష్టపడతారు. తమ ప్రేమ విషయం అభిత తండ్రికి (సుప్రీత్) చెప్పడానికి మణి భయపడతాడు. అభిత తండ్రి ఆమెకు మరొకరితో పెళ్లి ఫిక్స్ చేస్తుంటాడు. ఇష్టంలేని ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి మణి, అభిత దుబాయ్ పారిపోవాలని అనుకుంటారు.
దుబాయ్ వెళ్లడానికి కొన్ని డబ్బులు తక్కువ అవుతాయి. ఆ డబ్బులను మణి ఎలా సంపాదించాడు? వారిద్దరు దుబాయ్ వెళ్లారా? మణి, అభితలు దుబాయ్ వెళ్లడానికి రామ్, లక్ష్మణ్ ఎలా సాయపడ్డారు? విమానం ఎక్కాలనే రామ్, లక్ష్మణ్ కల తీరిందా? కూతురి ప్రేమను సర్పంచ్ అర్థం చేసుకున్నాడా? లేదా? వారందరి జీవితాల్ని గురించి కవర్ స్టోరీ రాయాలని అనుకున్న ప్రియ ఎవరు? అన్నదే ఈ సినిమా(Prema Vimanam Review) కథ.
రెండు కథలు...
తమ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఓ జంట సాగించే పోరాటం, తమ కల సాకారం కోసం ఓ ఇద్దరు చిన్నారులు పడే తాపత్రయం రెండు కథల ప్రయాణం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు ఈసినిమాను(Prema Vimanam Review) తెరకెక్కించారు.
తెలంగాణ నేటివిటీతో గ్రామీణ యాస, భాషలకు పెద్దపీట వేస్తూ ప్రేమవిమానం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. నిజంగానే పల్లెటూరి కథల్ని, జీవితాల్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. యాక్టింగ్, ఎమోషన్స్‌లో పండించడంలో సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చారు. మణి, అభిత లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. చిన్నారుల కథలో మదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.
ప్రియ క్యారెక్టర్....
ప్రేమకథ లాజిక్స్‌తో ఎండ్ అయితే పిల్లల స్టోరీ విషయంలో డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేరుగా కథలోకి వెళ్లకుండా ప్రియ అనే క్యారెక్టర్ ద్వారా కథ చెప్పించడం బాగుంది. చివరలో ఓ చిన్న ట్విస్ట్‌తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. కామెడీ కోసమే వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌ను సినిమాలో(Prema Vimanam Review) ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అతడి ట్రాక్ నవ్వించలేకపోయింది.
మణి, అభిత...
ఈ సినిమాలో మణి, అభిత పాత్రలే ఎక్కువగా షైన్ అయ్యాయి. పల్లెటూరి ప్రేమ జంట పాత్రలో వారి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ చక్కగా కుదిరాయి. సంగీత్ శోభన్, గోపరాజు రమణ ట్రాక్ నవ్వులను పంచుతుంది.
శాంతమ్మగా తల్లి పాత్రలో అనసూయ జీవించింది. కుటుంబబాధ్యతలు, కొడుకుల కల మధ్య సంఘర్షణకు లోనయ్యే మహిళగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. రామ్, లక్ష్మణ్‌లుగా దేవాన్ష్, అనిరుధ్ కూడా మెప్పించారు. ఛత్రపతి సుప్రీత్, నవీన్ బేతిగంటి ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు.
Prema Vimanam Review -ఫీల్‌గుడ్ మూవీ...
ప్రేమ విమానం రెండు కథలతో సాగే ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఈ వీకెండ్‌తో ఫ్యామిలీతో కలిసి చూడటానికి మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.
రేటింగ్:2.75/5
టాపిక్