Mr Bachchan OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?-ravi teja mr bachchan likely to streaming on netflix from this date tollywood movie ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Ott: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Mr Bachchan OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Nelki Naresh Kumar HT Telugu
Aug 23, 2024 04:51 PM IST

Mr Bachchan OTT: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సెప్టెంబ‌ర్ 12 నుంచి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చెబుతోంది.

మిస్టర్ బచ్చన్ ఓటీటీ
మిస్టర్ బచ్చన్ ఓటీటీ

Mr Bachchan OTT: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ బాలీవుడ్ రీమేక్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే దాదాపు ఇర‌వై ఐదు కోట్ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ద‌క్షిణాది భాష‌ల డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

సెప్టెంబ‌ర్ 12 న రిలీజ్‌...

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సెప్టెంబ‌ర్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకే రోజు తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. అదే డేట్ నిజ‌మైతే థియేట‌ర్ రిలీజ్‌కు...ఓటీటీకి నెల రోజులు కూడా గ్యాప్ ఉండ‌దు.

ఇండిపెండెన్స్ డే కానుక‌గా...

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్ట్ 15న థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన రైడ్ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ బోర్సే గ్లామ‌ర్ కార‌ణంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. కానీ ఆ అంచ‌నాల‌ను అందుకోలేక ఫ‌స్ట్ డేనే బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలాప‌డింది. ఔట్‌డేటెడ్ స్టోరీ కార‌ణంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ర‌వితేజ‌తో పాటు హ‌రీష్ శంక‌ర్‌కు పెద్ద షాకిచ్చింది.

మార్పులు, చేర్పుల‌పై విమ‌ర్శ‌లు...

హిందీ మూవీ రైడ్ సీరియ‌స్‌గా సాగుతుంది. కానీ మార్పుల‌, చేర్పుల పేరుతో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ను కామెడీ ల‌వ్‌స్టోరీగా చేసేశాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌. ఆ మార్పుల‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. ర‌వితేజ‌, భాగ్య‌శ్రీ బోర్సే ల‌వ్ ట్రాక్‌, వారిద్ద‌రి కెమిస్ట్రీని సినిమాలో చూపించిన తీరుపై ద‌ర్శ‌కుడిని ఫ్యాన్స్‌ను దారుణంగా ట్రోల్ చేశారు.

32 కోట్లు టార్గెట్‌...వ‌చ్చింది ఇంతే...

ర‌వితేజ‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కార‌ణంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ 31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ వీక్ ముగిసేలోగా కేవ‌లం ఎనిమిది కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ సాధించింది. నిర్మాత‌ల‌కు ఇర‌వై ఐదు కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

థియేట‌ర్ల నుంచి ఔట్‌...

ఫ‌స్ట్ వీక్‌లోనే దాదాపు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ థియేట‌ర్లు మొత్తం ఎత్తేశారు. థియేట్రిక‌ల్ రిజ‌ల్ట్ కార‌ణంగానే అనుకున్న‌దానికంటే ముందుగానే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించాడు. స‌త్య‌, ప్ర‌వీణ్, ఝూన్సీ, స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌కు పోటీగా ఇండిపెండెన్స్ డే రోజు రామ్, పూరి జ‌గ‌న్నాథ్ డ‌బుల్ ఇస్మార్ట్‌, విక్ర‌మ్ తంగ‌లాన్‌తో పాటు ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టించిన ఆయ్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆయ్ మిన‌హా మిగిలిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.