Rashmika Mandanna: బాలీవుడ్‌లో సొంత గళాన్ని వినిపిస్తున్న రష్మిక -గుడ్‌బై కోసం ఓన్ డబ్బింగ్
గుడ్‌బై సినిమాతో(Goodbye Movie) ఈ ఏడాది బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నది రష్మిక మందన్న(Rashmika Mandanna). అమితాబ్‌బచ్చన్ (amitabh bachchan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆక్టోబర్ 7న రిలీజ్‌కానుంది. గుడ్‌బై కోసం కొత్త ఛాలెంజ్‌ను స్వీకరించింది రష్మిక. అది ఏమిటంటే...
సీతారామం (Sitaramam) సినిమాతో తెలుగులో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొని లక్కీస్టార్‌గా మారిపోయింది రష్మిక మందన్న. ఈ సినిమాలో ఓ ప్రేమజంటకు మధ్య వారధిగా నిలిచే ఆఫ్రీన్ అనే యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో రష్మిక మందన్న కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో గత కొన్ని రోజులుగా బిజీగా గడిపిన ఆమె ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ముంబై ప్రయాణమైంది.
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం డబ్బింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉంది. తన పాత్రకు సంబంధించిన డైలాగ్ పేపర్ ముందుపెట్టుకొని డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రష్మిక మందన్న. ఈ ఫొటోను ఉద్దేశిస్తూ ఏదీ తేలికగా రాదు అంటూ క్యాప్షన్ జోడించింది. గుడ్ బై సినిమా పేరును కూడా ఈ ఫొటోకు జతచేసింది సినిమాతోనే రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెబుతూ సినిమాల పట్ల తనకున్న అంకితభావాన్ని, హార్డ్‌వర్క్‌ను మరోసారి చాటుకుంది.
ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న తండ్రిగా బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌బచ్చన్ కనిపించబోతున్నారు. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆక్టోబర్ 7న రిలీజ్‌కానుంది. గుడ్‌బైతో పాటు బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను , రణ్‌భీర్‌కపూర్ యానిమల్ సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. తెలుగులో త్వరలో పుష్ప-2 షూటింగ్ మొదలుపెట్టబోతున్నది.