Telugu News  /  Entertainment  /  Ranveer Singh Launches Devi Sri Prasad First Hindi Single
రణ్‌వీర్ సింగ్-దేవిశ్రీ ప్రసాద్
రణ్‌వీర్ సింగ్-దేవిశ్రీ ప్రసాద్

DSP First Hindi Single: మొదటి హిందీ పాప్ సాంగ్ విడుదల చేసిన దేవిశ్రీ.. లాంచ్ ఈవెంట్‌లో రణ్‌వీర్ సందడి

05 October 2022, 19:37 ISTMaragani Govardhan
05 October 2022, 19:37 IST

Ranveer Singh Launches DSP Song: దేవిశ్రీప్రసాద్ తన మొదటి హిందీ సాంగ్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. తొలి పాన్ ఇండియా పాప్ సాంగ్‌గా ఇది గుర్తింపు తెచ్చుకుంది.

DSP First Hindi Single: టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా గాయకుడిగా, పాటల రచయితగా ఆల్ రౌండ్‌ షోతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో మంచి బిజీగా సంగీత దర్శకుడిగా ఉన్న డీఎస్‌పీ.. అడపా దడపా హిందీలోనూ తన పాటలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఆడియెన్స్‌కు సుపరిచితులయ్యారు. అయితే ఫుల్ లెంగ్త్ పాటను ఇంతవరకూ దేవి ఇవ్వలేదు. తాజాగా తన ఫస్ట్ హిందీ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట లాంటింగ్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హాజరై రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రణ్‌వీర్ సింగ్‌.. దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి సందడి చేశాడు. ఇద్దరూ కలిసి ఆ పాటను పాడటమే కాకుండా.. అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాట ఫస్ట్ పాన్ ఇండియా పాప్ సాంగ్ కావడం విశేషం.

ఓ పారి అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రణ్‌వీర్, దేవి ఇద్దరూ ఓ పారి సిగ్నేచర్ స్టెప్‌తో అలరించారు. ఇది ప్రేక్షకులను అలరించింది. క్యాచీ పదాలతో దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్కు సంగీతంతో అద్భుతంగా ఆలపించాడు. ఓ పారి ట్రాక్ త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.

ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్‌పీ మాట్లాడుతూ.. "నేను కొంతకాలంగా సినిమాయేతర హిందీ సంగీత రంగంలోకి ప్రవేశించాలని ఆలోచనలో ఉన్నాను. ఇలాంటి సమయంలో భూషణ్ కుమార్‌ కాకుండా ఇంకెవరితో పనిచేయాలని నాకనిపించింది. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది." అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.

టాపిక్