Telugu News  /  Entertainment  /  Devi Sri Prasad Debut Hindi Music Album O Pari Release Date Revealed
దేవిశ్రీప్ర‌సాద్
దేవిశ్రీప్ర‌సాద్ (Twitter)

Devi Sri Prasad Hindi Music Album: దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ హిందీ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

01 October 2022, 6:16 ISTNelki Naresh Kumar
01 October 2022, 6:16 IST

Devi Sri Prasad Hindi Music Album: దేవిశ్రీప్ర‌సాద్ తొలిసారి హిందీలో ఓ మ్యూజిక్ ఆల్బ‌మ్ చేశాడు. ఈ హిందీ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే

Devi Sri Prasad Hindi Music Album: ఇతర భాషల కంటే బాలీవుడ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అగ్ర సంగీత దర్శకులు సైతం సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సంగీతాభిమానులను అలరిస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హిందీలో మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నాడు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు ఓ పరి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ పాటకు సంగీతాన్ని అందించడంతో పాటు దేవిశ్రీప్ర‌సాద్ స్వ‌యంగా పాడారు. ఇందులో ఆయ‌నే న‌టించిన‌ట్లు స‌మాచారం.

ఈ మ్యూజిక్ వీడియో పోస్ట‌ర్‌లో ల‌వ‌ర్ బాయ్ గెట‌ప్ లో దేవిశ్రీప్ర‌సాద్ క‌నిపిస్తున్నారు. ఓ ప‌రి మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ రివీల్ చేశారు. అక్టోబ‌ర్ 4న విడుదల చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. హిందీలో దేవిశ్రీప్ర‌సాద్ రూపొందిస్తున్న తొలి మ్యూజిక్ ఆల్బ‌మ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ పాట‌ను ర‌ఖీబ్ ఆలం రాశారు. టీసిరీస్ అధినేత భూష‌ణ్‌కుమార్ నిర్మించారు.

కాగా ప్ర‌స్తుతం తెలుగు,త‌మిళం,హిందీ భాష‌ల్లో ప‌లు సినిమాల‌కు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నాడు దేవిశ్రీప్ర‌సాద్‌. గ‌త ఏడాది అత‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన పుష్ప సినిమాలోని పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. ప్ర‌స్తుతం పుష్ప‌2 (Pushpa the rule)పాట‌ల‌ను స‌మ‌కూర్చే ప‌నిలో దేవిశ్రీప్ర‌సాద్ ఉన్నాడు.

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌(Waltair veerayya),భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్నాడు. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ కిసి కా జాన్ కిసి కి భాయ్‌తో పాటు భ‌వాల్,దృశ్యం-2 సినిమాల‌కు సంగీతాన్ని అందిస్తున్నాడు దేవిశ్రీప్ర‌సాద్‌.

టాపిక్