Skanda Official WW Collection: స్కందకు ఊహించని కలెక్షన్స్.. కానీ, భారీ టార్గెట్.. లాభం రావాలంటే?
Skanda 2 Days World Wide Collection: ఉస్తాద్ రామ్ పోతినేని ది వారియర్ మూవీ తర్వాత చేసిన సినిమా స్కంద. ది అటాకర్ అనేది ఉపశీర్షిక. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు చూస్తే..
Skanda Worldwide Collection: సెప్టెంబర్ 28న విడుదలైన రామ్ పోతినేని స్కంద సినిమాకు టాక్ పాజిటివ్‌గానే వస్తోంది. స్కంద బోయపాటి శ్రీను మార్క్ స్టైల్ మూవీ అని అభిమానులు అంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‍పై శ్రీనివాస చిట్టూరి స్కంద చిత్రాన్ని దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‍తో నిర్మించారని సమాచారం.
స్కంద బిజినెస్
ఎన్నో అంచనాలతో తెరకెక్కిన రామ్ పోతినేని స్కంద మూవీకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో రూ. 13 కోట్లు, సీడెడ్లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‍లో 19.50 కోట్ల బిజినెస్ కాగా.. ఏపీ, తెలంగాణలో ఓవరాల్‌గా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‍లో 2.20 కోట్ల మార్కెట్ చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా స్కందకు రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
2వ రోజు కలెక్షన్స్
శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన స్కంద చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. నైజాం ఏరియాలో రూ. 1.52 కోట్లు, సీడెడ్లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే స్కందకు రూ. 3.50 కోట్ల షేర్, రూ. 5.90 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో
స్కంద చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి చూస్తే.. నైజాంలో రూ. 4.75 కోట్లు, సీడెడ్లో రూ. 1.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలు వసూళు అయ్యాయి. స్కందకు మొత్తంగా రూ. 12.12 కోట్ల షేర్, రూ. 19.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
స్కంద చిత్రానికి కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 2 రోజుల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.25 కోట్లు వచ్చాయి. దీంతో స్కంద సినిమాకు 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 14.57 కోట్ల షేర్, రూ. 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అంటే రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసేందుకు స్కంద మూవీకి ఇంకా రూ. 32.43 కోట్ల రావాలి. అంత వస్తేనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలు వచ్చే అవకాశం ఉంది.
టాపిక్