Ram Pothineni Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్‍లో రామ్ పోతినేని? అప్పటి నుంచే మొదలంటూ!-ram pothineni about virat kohli biopic in skanda movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Pothineni About Virat Kohli Biopic In Skanda Movie Promotions

Ram Pothineni Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్‍లో రామ్ పోతినేని? అప్పటి నుంచే మొదలంటూ!

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2023 01:10 PM IST

Ram Pothineni On Virat Kohli Biopic: దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్‍గా పేరు తెచ్చుకున్నాడు. రామ్ తాజాగా నటించిన స్కంద మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ బయోపిక్‍లో రామ్ పోతినేని?
విరాట్ కోహ్లీ బయోపిక్‍లో రామ్ పోతినేని?

రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమా స్కంద (Skanda Movie). శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా, ఊర్వశీ రౌతెలా ఐటమ్ బాంబ్‍గా చేస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‍గా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. దీంతో రామ్ పోతినేని ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్‍ను ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే (Sanket Mhatre) ఇంటర్వ్యూ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

హీరోలకు డబ్బింగ్

హిందీలో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమా హీరోలకు, హాలీవుడ్ హీరోలకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతారు. ఇంటర్వ్యూలో సంకేత్, రామ్ మధ్యలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. "మీరు విరాట్ కోహ్లీలా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆయన బయోపిక్‍లో నటించే అవకాశం వస్తే చేస్తారా?" అని సంకేత్ అడిగారు.

అప్పటి నుంచి స్టార్ట్

సంకేత్ మాత్రే ప్రశ్నకు "నేను ఇస్మార్ట్ శంకర్ లుక్ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో కంపేరిజన్ మొదలైంది. ఒకవేళ కోహ్లీ బయోపిక్ వస్తే తప్పుకుండా చేస్తా. ఎగ్జైటింగ్ కదా. అందుకోసం క్రికెట్ కూడా నేర్చుకుంటాను" అని రామ్ పోతినేని ఆసక్తికరంగా తన మనసులో మాట బయటపెట్టారు.

షారుక్‍ని కలిసినట్లు

ఇదే ఇంటర్వ్యూలో ఫేవరేట్ బాలీవుడ్ హీరోలు ఎవరని అడిగిన ప్రశ్నకు "షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఈతరం హీరోల్లో రణ్‍బీర్ కపూర్ ఇష్టం అని రామ్ పోతినేని చెప్పుకొచ్చారు. ఇటీవల షారుక్ ఖాన్‍ను కలిసినట్లు రామ్ చెప్పాడు. తమిళ డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియా తనకు ఫ్రెండ్స్ అని, జవాన్ చిత్రీకరణకు వెళ్లినప్పుడు షారుక్‍కు పరిచయం చేశారని వెల్లడించాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.